• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఉత్తరాంధ్రాలో రెండు...

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

| ఉత్తరాంధ్రలో జనసేన రాజకీయంగా విస్తరిస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక సంస్థల కీలక పదవులు దక్కించుకోవడంతో పార్టీకి మరింత బలం చేకూరింది. 2029 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By - Satya P
Update: 2026-11-21 03:30 GMT

ఉత్తరాంధ్రలో జనసేన రాజకీయ ఆధిపత్యం బాగా పెరుగుతోంది. జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆ పార్టీ గట్టి పట్టు సాధించింది. ఇపుడు ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టింది. దానికి తగినట్లుగా టీడీపీ కూడా జనసేనను బాగా ప్రోత్సహిస్తోంది. ఉత్తరాంధ్రాలో ఉన్న ఆరు జిల్లాలలో మూడు ఇపుడు జనసేన రాజకీయ విస్తరణకు దోహదపడుతున్నాయి. దాంతో రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో జనసేన జెండా మరింత బలంగా పాతడానికి వీలు అవుతుందని అంటున్నారు.

శ్రీకాకుళంలో మొత్తం :

శ్రీకాకుళం జిల్లాలో కూటమి పొత్తులో భాగంగా మేయర్ పదవితో పాటు జిల్లా పరిషత్ పీఠం కూడా జనసేనకు కేటాయించారు. దాంతో ఇక్కడ తమకు జిల్లాలో పెద్ద పదవి ఏదీ దక్కలేదని తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి సంగతి పక్కన పెడితే జనసేన కేవలం విశాఖకే పరిమితం అయింది అని భావించిన వారికి ఇపుడు ఏపీలో చిట్ట చివరి జిల్లాలో ప్రధాన పదవిని అందుకునే స్థాయికి ఎదగడం కీలకమైన అంశంగా చూస్తున్నారు. ఈ నెల 26న మేయర్ పదవికి ఎన్నికలు ఉన్నాయి. ఈ పదవిని కూడా జనసేన గెలుచుకుంటే అక్కడ ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో 2029 నాటికి కనీసంగా మూడు నుంచి నాలుగు కోరే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.

మన్యం జిల్లాలో సైతం :

ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జనసేన తన రాజకీయ సత్తా చాటుకుంది. ఎస్టీ జిల్లా అయిన ఇక్కడ ఇప్పటికే జనసేనకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మల జయక్రిష్ణ ఉన్నారు. ఇపుడు ఏకంగా జెడ్పీ పీఠం దక్కింది. ఈ జిల్లాలో మొత్తం 15 జెడ్పీటీసీలు ఉంటే అందులో టీడీపీ ఏడు వైసీపీ అయిదు, జనసేన మూడు గెలుచుకున్నాయి. టీడీపీ నుంచి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ జెడ్పీ చైర్ పర్సన్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ చివరి నిముషంలో మార్పుల వల్ల జనసేనకు ఈ పీఠం దక్కింది. అంతే కాదు ఇదే జిల్లాలో సాలూరు మునిసిపల్ చైర్మన్ పీఠం కూడా జనసేన అందుకుంది. అలా ఎస్టీ జిల్లాలో మరింతగా తన రాజకీయాన్ని విస్తరించుకోవడానికి జనసేనకు వీలు చిక్కింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండింటిని అయినా జనసేన కోరుతుందని అంటున్నారు.

అనకాపల్లిలో సత్తా :

మరో వైపు చూస్తే అనకాపల్లి జిల్లాలో జనసేన తన సత్తాను చాటింది. తొలి జడ్పీ చైర్ పర్సన్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం 24 జడ్పీటీసీలు ఉన్న అనకాపల్లి జిల్లాలో మొత్తానికి మొత్తం కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి చోటు లేకుండా పోయింది. ఇందులో 17 జడ్పీటీసీలు టీడీపీ 5 జనసేన 2 బీజేపీ గెలుచుకున్నాయి. అయినా సరే జెడ్పీ పీఠాన్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. దాంతో అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో మరింతగా పుంజుకునేందుకు జనసేనకు పూర్తి అవకాశం దక్కుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రం అయిన అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుని జనసేన తీసుకుంది. అలాగే ఎలమంచిలి కూడా జనసేన ఖాతాలోనే ఉంది. 2029 ఎన్నికల నాటికి చోడవరం, మాడుగులను కూడా తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

బలపడిన వైనం :

స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఉత్తరాంధ్రాలో జనసేన బలపడింది అని అంటున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి దానిని డబులు చేసుకోవాలని అనుకుంటోంది. ఒకవేళ ఏపీలో సీట్లు పెరిగితే మరింత ఎక్కువగా తీసుకోవాలని చూస్తోంది. దానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కిన అధికార పదవులు ఎంతగానో ఉపయోగపడతాయని జనసేన అంచనా వేసుకుంటోంది.

Tags:    
  • janasena 
  • pavankalyan 
  • northandhra 
  • srikakulam 
  • parvathipurammanyam 
  • anakapalli 

Similar News

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

Copyright @2026

Powered by Blink CMS