• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  కలిసొచ్చే కాలానికి...

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

| ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఎన్నికలు జరిగిన 626 ఎంపీపీ స్థానాల్లో 583 చోట్ల విజయం సాధించింది. ఐదు మండలాల్లో ఓట్లు సమానంగా రావడంతో నిర్వహించిన లాటరీలోనూ నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. వైఎస్సార్‌సీపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది.

By - Tupaki Desk
Update: 2026-11-21 09:53 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో గెలిచి అధికారం దక్కించుకున్న టీడీపీ కూటమి, తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంతో పాటు అదృష్టం కూడా తనవైపే ఉందని నిరూపించుకుంది. రాష్ట్రంలో అధికార బలంతో దాదాపు 97 శాతానికి పైగా భారీ స్ట్రైక్ రేటుతో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న కూటమి, పోటీ హోరాహోరీగా సాగి టై అయిన చోట్ల కూడా లాటరీలో విజేతగా నిలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బలం ఉన్న చోట ఏకపక్షంగా గెలవడమే కాకుండా, విపక్షం దీటుగా నిలిచిన చోట్ల సైతం కాలం కలిసిరావడంతో పసుపు జెండా ఎగురవేసిందని అంటున్నారు.

కూటమి హవా

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 మండలాలకు గాను ఈ నెల 19న 626 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 33 చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూటమి అసాధారణ ఆధిపత్యాన్ని కనబరిచింది. ఎన్నికలు జరిగిన 626 స్థానాల్లో ఏకంగా 583 స్థానాలను కూటమి గెలుచుకుంది. ఇందులో టీడీపీ ఒంటరిగా 534 మండలాలను తన ఖాతాలో వేసుకోగా, జనసేన 42, బీజేపీ 7 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. అటు జడ్పీటీసీ స్థానాల విషయంలోనూ ఇదే తరహా రికార్డు స్థాయి స్ట్రైక్ రేటుతో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ కేవలం 39 ఎంపీపీ స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు 3, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి.

విపక్షాన్ని వెక్కిరించిన అదృష్టం

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఈ స్థానిక పోరులో కొన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ కూటమికి గట్టి పోటీనిచ్చింది. రాష్ట్రంలోని 5 మండలాల్లో అధికార, విపక్ష పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో ఫలితం ఉత్కంఠగా మారింది. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ (లక్కీ డ్రా) తీసి విజేతలను ప్రకటించారు. హోరాహోరీగా తలపడిన ఈ ఐదు చోట్ల విపక్షం దీటుగా నిలిచినా, చివరి నిమిషంలో అదృష్టం మాత్రం వారిని వెక్కిరించింది.లాటరీ తీసిన 5 మండలాల్లో ఏకంగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులే విజేతలుగా నిలవగా, వైఎస్సార్‌సీపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లాటరీ ద్వారా విజయం వరించిన స్థానాల్లో విజయనగరం జిల్లా గుర్ల మండలం ఉంది. ఇక్కడ ఇరుపక్షాలకు సమాన బలం ఉండటంతో లాటరీ తీశారు. ఇందులో టీడీపీ అభ్యర్థి సన్యాసినాయుడు ఎంపీపీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కృష్ణా జిల్లా ఉంగుటూరులోనూ టీడీపీకి చెందిన సుజిత లక్కీ డ్రాలో విజయం సాధించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలో కూడా లాటరీ నిర్వహించారు. ఇందులో అదృష్టం టీడీపీ అభ్యర్థి పొట్టేళ్ల పార్వతిని వరించింది.

అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో కూడా టీడీపీ అభ్యర్థి పిట్టా ఓబులరెడ్డి గెలుపొందారు. ఇక వాయిదా పడిన స్థానాల జాబితాలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలోనూ ఇరువర్గాలకు చెరో 7 ఓట్లు వచ్చి టై అవ్వగా, తర్వాత నిర్వహించిన లాటరీలోనూ కూటమి అభ్యర్థి పంచాడి మంజులనే అదృష్టం వరించింది.

అయితే అనకాపల్లి జిల్లా మునగపాకలో మాత్రం వైసీపీకి ఊరట దక్కింది. లాటరీ జరిగిన ఆరు స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి దక్కిన ఏకైక స్థానం ఇది. ఇక్కడ మొల్లేటి శంకర్ విజేతగా నిలిచారు. ఈ పరిణామాలను గమనించిన పరిశీలకులు అధికార బలంతో పాటు లక్కీ డ్రాలోనూ అదృష్టం కూటమికే వరించిందని అభివర్ణిస్తున్నారు.

Tags:    
  • aplocalelections 
  • tdp 
  • janasena 
  • bjp 
  • tdpalliance 
  • ysrcp 
  • mppresults 

Similar News

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

Copyright @2026

Powered by Blink CMS