• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జగన్ అంతకు మించి చేయలేరా...

జగన్ అంతకు మించి చేయలేరా ?

| ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార కూటమి అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. నామినేషన్ల అడ్డంకులు, రిగ్గింగ్‌పై ఎన్నికల సంఘం, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా.. సోషల్ మీడియా విమర్శలకే పరిమితమవుతున్నారనే చర్చ సాగుతోంది. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా, ఇతర పార్టీల మద్దతుతో పోరాటం చేస్తే వైసీపీ వాదనకు మరింత ప్రచారం లభించేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-22 00:21 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గత కొన్ని రోజులుగా ఒకే రకమైన తీరున మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయనుకోండి. కానీ అదే పనిగా ఆయన తన ఆవేదన కానీ ఆందోళన కానీ వ్యక్తం చేయడం వల్ల ఉపయోగం ఏమిటో వైసీపీ వారికే తెలియాలి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే వైసీపీని నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలు జరిగే దాకా కూడా అధికార కూటమి అడుగడుగునా ఇబ్బంది పెడుతోంది అని. ఫైర్ అండ్ ఫ్రీగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగడం లేదని. వైసీపీ వారు నామినేషన్లు దాఖలు చేస్తే వాటిని చింపేస్తున్నారు అని, అలాగే పోలింగ్ దగ్గర రిగ్గింగ్ చేస్తున్నారు అని, అధికార బలాన్ని అడుగడుగునా చూపిస్తున్నారు అని జగన్ ఆరోపణలు. ఆయన లేటెస్ట్ గా మరోసారి ఇదే విషయాలను ట్వీట్ రూపంలో చెప్పుకొచ్చారు.

వేదన అరణ్య రోదన :

జగన్ ఈ తరహా విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చ సాగుతోంది. అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తోంది అని జగన్ ఆరోపించారు. ఇప్పటికే ఆయన ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ని కూడా కలసి వచ్చారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఇదే విషయం మీద తాజాగా మరోసారి గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. జగన్ అయితే ట్వీట్లు వేస్తూ ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోంది అని అంటున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగడం లేదు అని అంటున్నారు. కానీ ఇదంతా అరణ్య రోదన గానే మిగిలిపోతోంది అని అంటున్నారు. ఎందువల్ల అంటే వైసీపీ న్యాయ పోరాటాలు చేసినా మరోటి చేసినా ఏపీలో కూటమి వ్యూహాత్మకంగా చేయాల్సింది చేస్తోంది. అలాంటపుడు దీనికి ఇతర మార్గాలను కూడా ఆలోచించాలి కదా అన్న చర్చ సాగుతోంది.

జాతీయ దృష్టికి :

ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది జాతీయ మీడియా దృష్టికి తేవడమో లేకపోతే జగన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఆందోళన నిర్వహించడమో చేయడం ద్వారా జాతీయ దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఉంటే ఎంతో కొంత వైసీపీకి మైలేజ్ దక్కేది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ చేస్తున్న వాదన ఢిల్లీ దాకా వినిపించేది అని కూటమిని అలా ఎక్స్ పోజ్ చేసేందుకు వీలు అయ్యేది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలో జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలియనివి కావు అన్నది కూడా ఉంది. కానీ ఢిల్లీ వేదికగా చేసుకుని నిరసనలు కానీ ఏదైనా ఆందోళనలు కానీ చేసిన పక్షంలో ఎన్డీయేకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నుంచి అయినా మద్దతు దొరికి ఆ మేరకు ఎన్డీయే మీద జాతీయ స్థాయిలో ఏపీలోనూ ఒత్తిడి పెరిగేది కదా అన్నది కూడా రాజకీయ విశ్లెషణలు ఉన్నాయి.

రోటీన్ గానే అంతా :

కానీ జగన్ అయితే రొటీన్ గా ట్వీట్లు పెడుతూనే అధికార కూటమి మీద సోషల్ మీడియా వేదికగానే యుద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. పులివెందులలో ఎన్నికలు సందర్భంగా జగన్ నిరసన చేశారు. అది బాగా హైలెట్ అయింది. మళ్ళీ ఆ స్థాయిలో వైసీపీ నుంచి పోరాట స్పూర్తి లేకుండా పోయింది అని అంటున్నారు. అంతే కాదు నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం మీద పరిణామాల మీద జగన్ ఇంటర్వూలు ఇస్తూ ఉంటే కూడా ఏపీలో కూటమి మీద అది ఒత్తిడి పెంచేదిగా ఉండేదని అంటున్నారు. పొరుగున ఉన్న కేటీఆర్ అయితే వివిధ నేషనల్ ఫ్లాట్ ఫారాలను ఎంచుకుని అక్కడ డిబేట్లకు హాజరవుతున్నారు. ఇంటరాక్ట్ అవుతున్నారు. వైసీపీ అధినేత మాత్రం ట్వీట్లతో సరిపెడుతున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ అంటే ఫైర్ బ్రాండ్ అని 2014 నుని 2019 దాకా ఆయన డైనమిక్ లీడర్ షిప్ ని చూసిన వారు అనే మాట. ఆనాడు ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి మరీ ఆందోళనలు చేశారు. మరి ఇపుడు అయితే అలాంటిది ఏదీ లేదని కూడా చర్చ అయితే సాగుతోంది. మరి వైసీపీ ఆలోచనలు వ్యూహాలు ఏమిటో చూడాల్సి ఉంది.

Tags:    
  • ysjagan 
  • ysrcp 
  • andhrapradeshpolitics 
  • localbodyelections 
  • tdp 

Similar News

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

బాబు హింట్ ఇచ్చారా... ఎవరా ఎమ్మెల్యేలు ?

2026-11-22 00:16 GMT

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

2026-11-21 18:47 GMT

నొప్పిలేని పరీక్షలు.. రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో సెన్సార్ల సంచలనం

2026-11-21 18:45 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS