• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్...

అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ..ఓటమిపై బాబు కామెంట్ !

| అల్లూరి జిల్లాలో వైసీపీ జెడ్పీ పీఠం దక్కించుకోవడంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 28 జిల్లా పరిషత్తుల్లో 27 కూటమి గెలిచినా, అల్లూరిలో ఓటమికి కారణాలపై సమీక్ష చేస్తామని చెప్పారు. అరకు కాఫీ ప్రమోషన్, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఎందుకు మారిందో అధ్యయనం చేస్తామన్నారు.

By - Satya P
Update: 2026-11-22 04:15 GMT

నాయకుడు ఎపుడూ వచ్చిన విజయం చూసి మురిసిపోడు, ఓటమి ఒక్కటి దక్కినా దాని గురించే ఆలోచిస్తాడు. అచ్చం అలాగే చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అందులో 27 కూటమి ఖాతాలోనే పడ్డాయి. కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతో అతి చిన్నగా ఉన్న అల్లూరి జిల్లాలో మాత్రం వైసీపీ జెండా ఎగరేసింది. అక్కడ 11 జెడ్పీటీసీలు ఉన్నాయి. అందులో ఏడింటిని గెలుచుకున్న వైసీపీ ఏకైక జిల్లా పరిషత్తుని సొంతం చేసుకుంది. నిజానికి కూటమి ఈ విషయంలో చింతించాల్సింది ఏమీ లేదు. చంద్రబాబే చెప్పుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతం స్ట్రైక్ రేట్ ని సాధించారు. కానీ ఈ గెలుపుని ఆస్వాదిస్తూనే ఆ ఓటమిని కూడా సమీక్షించుకుంటామని చెప్పడం ద్వారా బాబు తన నాయకత్వ పటిమ ఏమిటో గట్టిగానే చెప్పారు.

బ్రాండ్ అంబాసిడర్ గా :

అరకు కాఫీని ప్రమోట్ చేసింది నేనే అని బాబు మీడియా మీట్ లో అన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపుని తీసుకుని వచ్చాం, అంతే కాదు ఎక్కడైకి వెళ్ళినా అరకు కాఫీనే అతిధులకు ఆతిధ్యం ఇస్తున్నాం, పదే పదే అందరికీ అరకు కాఫీ గురించి చెబుతూ మరింతగా ప్రాచుర్యం కల్పిస్తున్నామని బాబు గుర్తు చేశారు. తాజాగా విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో కూడా తాను ఒక ప్రామిస్ చేశాను అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే సీఐఐ సదస్సుకు వచ్చిన వారిని అరకు తీసుకుని వెళ్తామని అక్కడ అన్నీ వారికి స్వయంగా చూపిస్తామని కూడా చెప్పారు. అలాగే గిరిజన విర్యాధులకు ఐఐటీ విద్యను అందించేందుకు కూడా కృషి చేస్తున్నామని మంచి స్కూల్స్ పెట్టామని వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని బాబు చెప్పారు. ఇన్ని చేసి ఓటమి పాలు కావడం మీదనే సమీక్ష చేస్తున్నామని ఆయన అన్నారు.

అదేమిటో అధ్యయనం :

వీటికి మించి ప్రజలకు ఏమి కావాలో తాను అధ్యయనం చేస్తున్నాను అని అన్నారు. ప్రజలు కోరుకున్నవి అన్నీ ప్రభుత్వం చేసి పెడుతోందని అయినా సరే అల్లూరి జిల్లాలో ఫలితం వేరే విధంగా రావడం అంటే ఆలోచించుకోవాల్సిందే అని అన్నారు. ఇదే సందర్భంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతపు మత మార్పిడిలులు ఎక్కడ జరిగినా ఆలోచించాల్సిందే అని అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తాను అని చెప్పారు. ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు తెలంగాణలో ఒక చోట చర్చి మీద దాడి జరిగితే తాను స్వయంగా అక్కడికి వెళ్లి చూసి వచ్చాను అని అలాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే దేవాలయాల మీద దాడులు జరిగినా ఖండిస్తూ పోరాటాలు చేశామని అన్నారు. ఏది ఏమైనా ప్రజలు అంతా అభివృద్ధికి అండగా ఉంటే మరింతా రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుంది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే అల్లూరి జిల్లాలో వైసీపీ సాగిస్తున్న వరస విజయాల మీద కూటమి ప్రత్యేకించి బాబు ఫోకస్ పెట్టారు. మరి రానున్న రోజులలో అక్కడ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Tags:    
  • chandrababu 
  • andhrapradesh 
  • alluridistrict 

Similar News

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

బాబు హింట్ ఇచ్చారా... ఎవరా ఎమ్మెల్యేలు ?

2026-11-22 00:16 GMT

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

2026-11-21 18:47 GMT

నొప్పిలేని పరీక్షలు.. రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో సెన్సార్ల సంచలనం

2026-11-21 18:45 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

Copyright @2026

Powered by Blink CMS