• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆస్కార్ రేసులో చిన్న...

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

| 2027 ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత్ నుంచి ఎంపికైన మరాఠీ చిత్రం ‘గొందల్’ 104 అర్హత సాధించిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే ఇది నామినేషన్ కాదు. డిసెంబర్‌లో ప్రకటించే 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో చోటు కోసం పోటీపడనుంది. జనవరి 21న తుది నామినేషన్లు ప్రకటించనున్నారు.

By - M Prashanth
Update: 2026-11-24 12:46 GMT

ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి ఏ సినిమా వెళ్లాలనే విషయంలో ప్రతిసారీ పెద్ద పోటీ ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాల పేర్లు మెయిన్ గా వినిపిస్తుంటాయి. చిన్న సినిమా కూడా ఆ ఛాన్స్ కొట్టేయొచ్చు. ఈసారి కూడా అదే జరిగింది. అయితే ఇండియా తరఫున ఎంపిక కావడం ఒక ఎత్తయితే, అక్కడి నుంచి ఆస్కార్ నామినేషన్ల వరకు వెళ్లడం మరో ఎత్తు.

2027 ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి మొత్తం 104 సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారత్ నుంచి మరాఠీ థ్రిల్లర్ గొందల్ కూడా ఉంది. సెప్టెంబర్‌లోనే ఈ సినిమాను ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అకాడమీ ప్రకటించిన జాబితాలో చోటు దక్కింది. అయితే ఇది నామినేషన్ కాదు. అసలు పోటీకి అర్హత సాధించిన సినిమాల లిస్ట్ మాత్రమే. ఈసారి గతంలో కంటే ఎక్కువ సినిమాలు రేసులో ఉండటం విశేషం.

ఇక్కడ గొందల్ టీమ్‌కు అసలు ఛాలెంజ్ డిసెంబర్‌లో ఎదురుకానుంది. మొత్తం 104 చిత్రాల్లో నుంచి షార్ట్‌లిస్ట్‌కు కేవలం 15 మాత్రమే వెళ్తాయి. డిసెంబర్ 7 నుంచి 11 వరకు ఓటింగ్ నిర్వహించి, 15న ఆ జాబితాను ప్రకటిస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. మన దగ్గర వచ్చిన మంచి రివ్యూలు మాత్రమే సరిపోవు. అకాడమీ ఓటర్లకు సినిమా చేరడం కూడా ముఖ్యం.

గొందల్ కథ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మహారాష్ట్రలో జరిగే సంప్రదాయ గొందల్ కార్యక్రమం నేపథ్యంలో కథ నడుస్తుంది. ఒక రాత్రిలో జరిగే సంఘటనలతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించగా ఇషితా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకుడికి అవార్డు కూడా వచ్చింది.

నిజానికి ఇలాంటి సినిమాలకు థియేటర్లలో పెద్ద ఓపెనింగ్స్ రావడం కష్టమే. కానీ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. గొందల్ కూడా ముందుగా ఆ రూట్‌లోనే పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది మరాఠీ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఆరు పురస్కారాలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ ఓటర్ల వరకు వెళ్లే అవకాశం దక్కింది.

మరోవైపు ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాల సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. కొన్ని చిత్రాలు అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ఇప్పటికే అవార్డులు అందుకున్నాయి. జనవరి 21న ఫైనల్ నామినేషన్లు ప్రకటిస్తారు. మార్చి 14న ఆస్కార్ వేడుక జరగనుంది. గతంలో పలు భారతీయ సినిమాలు అధికారిక ఎంట్రీగా వెళ్లినా ఫైనల్ నామినేషన్ల వరకు చేరలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • oscars2027 
  • gondhal 
  • marathifilm 
  • oscarrace 
  • internationalfeaturefilm 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS