పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!
| బిగ్‌బాస్ ఫేమ్ దివి వద్యా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తన ఎత్తు 5.8 అడుగులు కాగా, కాబోయే భాగస్వామి కనీసం 6.2 లేదా 6.3 అడుగులు ఉండాలని కోరుకుంది. తెలివి, కష్టపడే తత్వంతో పాటు తన కెరీర్‌కు మద్దతుగా నిలిచి, కష్టాల్లో భరోసా ఇచ్చే వ్యక్తి కావాలని చెప్పింది.
బిగ్‌బాస్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న దివి వద్యా, తన పర్సనల్ లైఫ్, పెళ్లి గురించి చాలా క్లియర్‌గా మాట్లాడింది. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తనకు నచ్చని విషయాలతో పాటు, కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఓపెన్‌గా చెప్పేసింది. ఇప్పటివరకు అలాంటి వ్యక్తి తనకు దొరకలేదని అనడం విశేషం. ఇంతకీ దివి కోరుకునే ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
హైట్, ఇంటెలిజెన్స్.. ఇవే ఫస్ట్ ప్రియారిటీస్:
దివి తన హైట్ ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉంటుందట. అందుకే తనను పెళ్లి చేసుకునే అబ్బాయి కనీసం ఆరు అడుగుల రెండు లేదా మూడు అంగుళాలు పొడవు ఉండాలని కోరుకుంది. ఇక ఎవరినైనా చూడగానే ముందుగా హైట్ చూస్తానని, చెప్పింది. వీటితో పాటు కష్టపడి పనిచేసే తత్వం కూడా ఉండాలని క్లారిటీ ఇచ్చింది.
"నేను చూసుకుంటాను" అనే ధైర్యం కావాలి:
రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం, అభిప్రాయాలు కలవడం చాలా ముఖ్యమని దివి అభిప్రాయపడింది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు "నేను ఉన్నాను, నీకు ఏ భయం లేదు.. అంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను" అని ధైర్యం చెప్పే మగవాడు కావాలని కోరుకుంది. తన కలలను, కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ తోడుగా నిలిచే వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది.
‘మహర్షి’ నుంచి బిగ్‌బాస్ వరకు ఆమె జర్నీ:
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ‘మహర్షి’ లాంటి సినిమాలో మెరిసినా దివికి అసలైన గుర్తింపు బిగ్‌బాస్ సీజన్ 4తోనే వచ్చింది. తన హైట్, అందం, నవ్వుతో యూత్‌కు ఫేవరెట్‌గా మారిపోయింది. ఇక షోలో తక్కువ వారాలే ఉన్నా, ఆడియన్స్ మనసుల్లో మంచి స్థానం సంపాదించుకుంది.
తనకు తగ్గ జోడీ దొరికేదెప్పుడో:
పెళ్లి విషయంలో ఎలాంటి హడావుడి లేకుండా, తనకు ఏం కావాలో చాలా స్పష్టంగా చెప్పింది దివి. ఆలోచనలు కలిసే, భరోసా ఇచ్చే పార్ట్‌నర్ దొరికినప్పుడే లైఫ్ బాగుంటుందనేది ఆమె మాటల్లో కనిపించింది. మరి దివి మనసు దోచే ఆ పొడగరి, తెలివైన అబ్బాయి త్వరలోనే దొరకాలని కోరుకుందాం..