• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి ఎఫెక్ట్.....

రాజమౌళి ఎఫెక్ట్.. త్రివిక్రమ్‌కూ అదే ఇబ్బంది!

| పవన్, మహేశ్, వెంకటేశ్‌లతో రిపీట్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. అయితే అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’తో ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి జతకడుతున్న ఆయన, కార్తికేయ స్వామి కథతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

By - M Prashanth
Update: 2026-11-24 08:30 GMT

ఒక హీరోతో పెద్ద హిట్ కొట్టాక మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉండవు. గతంలో ఇచ్చిన హిట్‌ను మించి ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ ప్రతిసారీ అది సాధ్యం కావడం లేదు. టాలీవుడ్‌లో రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు ఎదురయ్యే పరిస్థితి గురించి చాలా కాలంగా ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ విషయంలోనూ దాదాపు అలాంటి పోలికే కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ హీరోలతో రెండోసారి, మూడోసారి సినిమా చేసినప్పుడు ఎక్కువగా తేడా కొడుతోంది.

రాజమౌళితో సినిమా చేశాక హీరోలకు తర్వాతి మూవీ కలిసి రాదనే ప్రచారం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించింది. కానీ ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. రాజమౌళి ఇచ్చిన ఆ హైని తర్వాతి సినిమాలోనూ ఆశించడం ఒక కారణం. త్రివిక్రమ్ దగ్గర కూడా అంచనాల సమస్య ఉన్నా, కొన్ని సందర్భాల్లో కథలు కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు.

పవన్ కళ్యాణ్‌తో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ మూడోసారి అజ్ఞాతవాసితో పెద్ద దెబ్బ తిన్నారు. మహేశ్ బాబుతో అతడు తర్వాత చేసిన ఖలేజా అప్పట్లో కమర్షియల్‌గా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన గుంటూరు కారం కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూడు సినిమాలకు రిలీజ్ ముందు మంచి క్రేజ్ ఉంది. కానీ కంటెంట్ విషయంలోనే ఆడియన్స్ నుంచి ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.

అయితే అల్లు అర్జున్ విషయంలో త్రివిక్రమ్ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల వైకుంఠపురములోతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బన్నీ కెరీర్‌లో అప్పటికి అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మూడో సినిమా అయినా గత రెండు చిత్రాలను మించి వసూళ్లు రాబట్టింది. సో కాంబినేషన్ రిపీట్ కావడం కన్నా కంటెంట్ ఎంత బలంగా ఉందనేదే ఇక్కడ ముఖ్యం.

రీసెంట్‌గా వెంకటేశ్‌తో చేసిన ఆదర్శ కుటుంబం కూడా త్రివిక్రమ్‌కు నిరాశ మిగిల్చింది. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించారు. ఆ కాంబినేషన్‌లో ఉన్న కామెడీని గుర్తుపెట్టుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ కొత్త సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. పైగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ మార్కెట్ మంచి ఊపులో ఉంది. అయినా ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఇప్పుడు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. అరవింద సమేత తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కార్తికేయ స్వామి కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. త్రివిక్రమ్‌కు ఈ జానర్ కూడా కొత్తే. నిర్మాత నాగవంశీ గతంలో చెప్పిన దానిప్రకారం 2027 జూలై నుంచి షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్ ఉంది. మరోవైపు ఎన్టీఆర్ అనిల్ రావిపూడితోనూ సినిమా ప్రకటించారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంలో అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.

Tags:    
  • trivikram 
  • jrntr 
  • alluarjun 
  • tollywood 

Similar News

షారుఖ్‌కు హాలీవుడ్ దెబ్బ.. కింగ్‌కు ఓ టెన్షన్!

2026-11-24 08:32 GMT

పెద్ద హీరోలు లేకుండానే క్రేజ్ కొట్టేస్తున్నారు

2026-11-24 08:32 GMT

పేదింటి బిడ్డకు కోటి రూపాయల జాక్‌పాట్!

2026-11-24 08:31 GMT

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!

2026-11-24 08:29 GMT

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

కమర్షియల్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ ఉంటే హిట్టు పక్కనా?

2026-11-24 06:31 GMT

సీతమ్మ‌ పాత్ర‌ను నితీష్ పున‌రాలోచించాల్సిందే!

2026-11-24 06:30 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

Copyright @2026

Powered by Blink CMS