• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీతమ్మ‌ పాత్ర‌ను నితీష్...

సీతమ్మ‌ పాత్ర‌ను నితీష్ పున‌రాలోచించాల్సిందే!

| ‘రామాయణం పార్ట్ 1’లో సీతగా సాయి పల్లవి నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్ట్ 2లో ఆమెను కొనసాగించాలా లేక మరో నటిని తీసుకోవాలా అనే చర్చ మొదలైంది. అయితే పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దుతారా అన్నది దర్శకుడు నితీష్ తివారీ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

By - Srikanth Kontham
Update: 2026-11-24 06:30 GMT

భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన నితీష్ తివారీ `రామాయణం పార్ట్ 1బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా సత్తా చాటుతున్నా? అందులో ప్రధాన పాత్రల ఎంపికపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీతమ్మ పాత్రలో నటించిన సాయి పల్లవి ఎంపిక ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదన్న విమర్శలు ప్రేక్షకుల్లోనూ బలంగా వినిపిస్తున్నాయి. ఇతిహాస గాథలోని సీతమ్మకు ఉండే దివ్యత్వం.. ఆ రాజసపు గంభీరత తెరపై ఆశించినంతగా పండలేదని ఆ పాత్రలో సాయి పల్లవిని ఊహించుకోవడం కొంత భారంగా మారిందన్న అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీస్తుంది.

సహజ నటనకు మారుపేరుగా నిలిచే సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. అయితే పౌరాణిక గాథల్లోని పాత్రలకు ఉండే ఆహార్యం.. శరీర భాష పూర్తిగా భిన్నంగా ఉంటాయనేది విశ్లేషకుల మాట. మొదటి భాగంలో సాయి ప‌ల్ల‌వి మేక‌ప్.. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఆశించిన మ్యాజిక్ జరగకపోవడంతో సీతమ్మ పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. రావణుడిగా యశ్ చూపించిన ఇంపాక్ట్ ముందు ప్రధాన పాత్రల తేజస్సు కొంత వెలవెలబోయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొదటి భాగంలో సీతమ్మ పాత్రకు కత్తిపట్టి పోరాడే యాక్షన్ సన్నివేశాలు జోడించడం కూడా వివాదాస్పదమైంది. వాల్మీకి రామాయణంలో లేని ఇలాంటి మార్పులపై ముఖేష్ ఖన్నా వంటి సీనియర్ నటులు సైతం అభ్యంతరం వ్యక్తం చేయగా.. దర్శకుడు నితీష్ తివారీ మాత్రం అద్భుత రామాయణం ..బిలంక రామాయణాలను ఉదహరిస్తూ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఆయా సన్నివేశాల వల్ల సీతమ్మ పాత్రకు ఉండే సంప్రదాయ సౌమ్యత దెబ్బతిందన్న విమర్శలు సాయి పల్లవి నటనపైనా ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలోనే `రామాయణం పార్ట్ 2` కోసం సీతమ్మ పాత్ర విషయంలో దర్శకుడు నితీష్ తివారీ పునరా లోచించాలన్న డిమాండ్లు నెట్టింట మొదలయ్యాయి. రెండో భాగంలో అశోకవనంలోని భావోద్వేగ సన్నివేశాలు.. అగ్నిపరీక్ష వంటి అత్యంత కీలక ఘట్టాలు ఉండటంతో ఆ స్థాయి గాంభీర్యాన్ని మోయగల మరో నటిని ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్ట్ 2 విడుదలను 2028కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించడంతో స్క్రిప్ట్.. కాస్టింగ్ విషయంలో మార్పులకు తగిన సమయం ఉందన్న చర్చ ఊపందుకుంది.

అయితే ఒక భారీ ప్రాజెక్ట్ మధ్యలో ప్రధాన పాత్రధారిని మార్చడం అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికే మొదటి భాగంలో ప్రేక్షకులకు పరిచయమైన ముఖాన్ని మారిస్తే కథలో కంటిన్యుటీ దెబ్బతినే ప్రమాదం ఉందని.. మరోవైపు సాయి పల్లవి నటనకు ధనుష్ వంటి ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. మొదటి భాగంలో ఎదురైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని రెండో భాగంలో సాయి పల్లవి పాత్ర తీరుతెన్నులను మార్చి మరింత బలంగా చూపిస్తారా లేక నిజంగానే కొత్త నటి వైపు మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో నితీష్ తివారీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    
  • ramayana 
  • saipallavi 
  • niteshtiwari 
  • ramayanapart2 

Similar News

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

కమర్షియల్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ ఉంటే హిట్టు పక్కనా?

2026-11-24 06:31 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?

2026-11-24 05:41 GMT

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

Copyright @2026

Powered by Blink CMS