• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లిన్ కారాను స్కూల్‌కి...

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

| రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లిన్ కారా తాజాగా ప్రీ స్కూల్‌లో చేరింది. స్కూల్‌కు వెళ్లిన సమయంలో తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ, కాస్త మారాం చేస్తున్నట్లుగా కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అయాన్, అర్హ, నవిష్క స్కూల్‌కు వెళ్తుండగా.. ఇప్పుడు క్లిన్ కారా కూడా వారి సరసన చేరింది.

By - Sivaji Kontham
Update: 2026-11-24 03:50 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతుల గారాలపట్టి క్లిన్ కారా కొణిదెల ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుడి బుడి అడుగుల‌తో ఇల్లంతా సంద‌డి చేస్తూ కుటుంబంలో క్లిన్ కారా గొప్ప‌ ఆనందాలు నింపుతుంది. క్లిన్ గురించి ఒక కొత్త విష‌యం అభిమానుల్లో చర్చ‌గా మారింది. జూన్ 2023లో జన్మించిన క్లిన్ కారాకు ప్రస్తుతం మూడున్నరేళ్ల వయసు రావడంతో ఇటీవలే త‌న‌ను మామ్ - డాడ్ స్వ‌యంగా ప్రీ-స్కూల్‌లో చేర్పించారు. అయితే స్కూల్‌కు వెళ్లమంటే చిన్నారి క్లిన్ కారా కాస్త మారాం చేస్తోందా? అన్నట్లుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన వీడియో చూసాక‌ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తండ్రి రామ్ చరణ్‌- ఉపాస‌న‌తో సరదాగా ఆడుకుంటూ స్కూల్‌కు వెళ్లిన‌ క్లిన్ కారా వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్కూల్ స్టాఫ్ క్లిన్ ని సముదాయిస్తూ మురిపెంగా చూస్తున్న వీడియో ఆక‌ట్టుకుంది.

మరోవైపు మెగా, అల్లు కుటుంబాల్లోని స్టార్ కిడ్స్ అంతా ఇటీవ‌ల‌ చదువుల బాటలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు. సినిమా ఈవెంట్లలో.. సోషల్ మీడియా వీడియోలలో అయాన్, అర్హ తమ చురుకైన మాటలతో అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటారు. వీరితో పాటు అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ (వెంకటేష్) కుమార్తె అన్విత కూడా స్కూల్‌కు వెళ్తూ చదువుల్లో రాణిస్తోంది.

ఇక మెగా ఫ్యామిలీలోని మిగతా కిడ్స్ విషయానికి వస్తే.. చిరంజీవి కుమార్తెలు సుష్మిత, శ్రీజ పిల్లలు కూడా తమ చదువుల్లో నిమగ్నమై ఉన్నారు. శ్రీజ చిన్న కుమార్తె నవిష్క కూడా స్కూల్‌కు వెళ్తూ తన క్యూట్ లుక్స్‌తో మెగా అభిమానులకు సుపరిచితమే. కుటుంబ వేడుకల సమయంలో ఈ మెగా, అల్లు కిడ్స్ అంతా ఒకేచోట చేరి సందడి చేయడం అభిమానులకు ఎప్పుడూ కనువిందుగా ఉంటుంది.

అయితే మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతుల చిన్నారికి మాత్రం ఇంకా స్కూల్‌కు వెళ్లే వయసు రాలేదు. ప్రస్తుతం ఆ చిన్నారి ఇంట్లోనే తల్లిదండ్రులు... తాత నాగబాబుల గారాబంలో పెరుగుతోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో అయాన్, అర్హ, నవిష్కల సరసన ఇప్పుడు క్లిన్ కారా కూడా స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని చేరిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • klinkaara 
  • ramcharan 
  • upasana 
  • megafamily 

Similar News

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

Copyright @2026

Powered by Blink CMS