• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ బ‌క్క‌గా...

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

| ‘వారణాసి’ కోసం మహేష్ బాబు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయతో కలిసి ఉన్న ఫోటోలో ఆయన మరింత సన్నగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, పాత్ర కోసమే నిపుణుల పర్యవేక్షణలో ఈ మార్పు చేసుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

By - Sivaji Kontham
Update: 2026-11-24 00:48 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు మ‌హేష్‌. అయితే తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయతో కలిసి మహేష్ బాబు సరదాగా చిట్ చాట్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేష్ బాబు మునుపటి కంటే మరీ ఎక్కువగా బక్కచిక్కిపోయి కనిపించడం చూసి అభిమానులు ఒక్కసారిగా కలవరపడుతున్నారు. తమ అభిమాన హీరో ఇంతగా సన్నబడిపోవడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక సినిమా పాత్ర కోసం ఎంత అంకితభావం ఉన్నా.. మరీ ఇంతగా తిండి కట్టేసి ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలా అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. `వారణాసి` చిత్రం కోసం మహేష్ బాబు ఎన్నో కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొండలు, గుట్టలు, దట్టమైన అడవుల్లో ప్రయాణించారు. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ.. కఠినమైన డైట్ పాటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఒక రగ్గడ్ - విభిన్నమైన లుక్‌లోకి మారేందుకు మహేష్ ఈ సాహసం చేశారు.

అయితే ఈ తీవ్రమైన డైట్-కఠినమైన శారీరక శ్రమ కారణంగా మహేష్ బాబు రూపం పూర్తిగా మారిపోయినట్లు తాజా ఫోటోలో కనిపిస్తోంది. ఆయనలోని సహజమైన చార్మ్ కాస్త తగ్గినట్లు.. చేతులు, కాళ్లు బాగా బక్కచిక్కి కనిపించడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తమ హీరోను ఎప్పుడూ ఎంతో అందంగా.. హ్యాండ్సమ్‌గా చూసుకునే ఫ్యాన్స్‌కు ఈ కొత్త అప్పియరెన్స్ కాస్త షాక్ ఇచ్చింది. ``సినిమా కోసం ఇంత త్యాగం అవసరమా అన్నయ్యా?`` అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు మహేష్ బాబు ఆరోగ్యం విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన పూర్తి ఆరోగ్యంగా- అత్యంత ఫిట్‌గా ఉన్నారని.. పాత్ర డిమాండ్ మేరకే నిపుణుల పర్యవేక్షణలో ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందని సమాచారం. మహేష్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా.. కేవలం అత‌డి బాహ్య రూపం మరీ సన్నగా మారిపోవడమే అభిమానుల ఆవేదనకు ప్రధాన కారణమవుతోంది.

`వారణాసి` సినిమా రిలీజ్ ప్లాన్ - ప్రమోషన్ల విషయానికొస్తే... రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో అత్యంత భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. షూటింగ్ కీలక దశకు చేరుకోవడంతో త్వరలోనే ప్రపంచవ్యాప్త ప్రమోషన్లకు శ్రీకారం చుట్టేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. భారతీయ సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు భారీ బిజినెస్ - మార్కెటింగ్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

Tags:    
  • maheshbabu 
  • varanasi 
  • ssrajamouli 
  • kartikeya 
  • tollywood 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS