• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.....

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

| ‘వార్’, ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ పూర్తయ్యాక నెట్‌ఫ్లిక్స్ కోసం ‘జ్యువెల్ థీఫ్ 2’ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. 2027లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ధూమ్’ తరహాలో ప్రతి భాగంలో కొత్త స్టార్లు, పవర్‌ఫుల్ విలన్లతో భారీ యాక్షన్ ఫ్రాంచైజీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.

By - Sivaji Kontham
Update: 2026-11-24 00:29 GMT

బాలీవుడ్‌లో వార్, పఠాన్ వంటి బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన దైన ముద్ర వేసిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు ఓటీటీ వేదికపైనా అదే స్థాయి సంచలనానికి తెరలేపుతున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కలిసి ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` పనుల్లో తలమునకలై ఉన్న ఆయన ఆ ప్రాజెక్ట్ పూర్తికాగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి తమ సూపర్ హిట్ హీస్ట్ థ్రిల్లర్ `జ్యువెల్ థీఫ్` సీక్వెల్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. థియేటర్లలో యష్ రాజ్ ఫిల్మ్స్ సృష్టించిన `ధూమ్` ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ తరహాలోనే.. డిజిటల్ ప్రపంచంలో `జ్యువెల్ థీఫ్`ను ఒక భారీ యాక్షన్ ఫ్రాంచైజీగా మార్చాలనేది సిద్ధార్థ్ ఆనంద్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.

అయితే ఇక్కడ సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సాధారణంగా భారీ యాక్షన్ సినిమాలకు వందల కోట్ల బడ్జెట్ పెడితే... థియేట్రికల్ కలెక్షన్ల రూపంలో ఆ పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఓటీటీ వేదిక కోసం రూపొందించే సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లపై అంత భారీ బడ్జెట్ పెడితే ఆ స్థాయి రాబడి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా `ధూమ్` తరహా ఫ్రాంచైజీ అంటే భారీ ఛేజింగ్ సీక్వెన్సులు.. అంతర్జాతీయ లొకేషన్లు.. స్టార్ క్యాస్టింగ్ తప్పనిసరి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై టికెట్ విండో రెవెన్యూ ఉండదు కాబట్టి నెట్‌ఫ్లిక్స్ - సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏ తరహా బిజినెస్- మార్కెటింగ్ ఫార్ములాను అనుసరిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ బ‌డ్జెట్ లెక్కలను అధిగమించేందుకు సిద్ధార్థ్ ఆనంద్ ఒక పక్కా `గ్లోబల్ మార్కెటింగ్` వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. మొదటి భాగంలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించి గ్లోబల్ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ వ్యూస్ సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం హాలీవుడ్ `ఓషన్స్ 11`.. బాలీవుడ్ `ధూమ్` ఫార్ములాను మిక్స్ చేస్తున్నారు. అంటే.. ఒకే స్టార్ హీరోపై ఆధారపడకుండా ప్రతి భాగానికి తారాగణాన్ని మారుస్తూ.. ముఖ్యంగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచేలా సరికొత్త- పవర్‌ఫుల్ విలన్లను రంగంలోకి దించనున్నారు. క్రేజీ కాంబినేషన్లు, స్టైలిష్ విలనిజం ఉంటే ఓటీటీలో కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాన్-థియేట్రికల్ వ్యూయర్‌షిప్ ద్వారా పెట్టిన బడ్జెట్‌కు మించిన లాభాలను నెట్‌ఫ్లిక్స్ సులభంగా రాబట్టుకోగలదని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే `జ్యువెల్ థీఫ్ 2`కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతుండగా.. 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగాన్ని మరింత భారీ స్కేల్‌లో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హీస్ట్ డ్రామాగా తీర్చిదిద్దాలని సిద్ధార్థ్ ఆనంద్ భావిస్తున్నారు. `ధూమ్` సిరీస్‌లో ప్రతి సినిమాకు జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి స్టార్లను విలన్లుగా మార్చి ఎలాగైతే హైప్ క్రియేట్ చేశారో `జ్యువెల్ థీఫ్` ఫ్రాంచైజీలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ ఓటీటీ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

మొత్తానికి థియేటర్లకే పరిమితమైన భారీ కమర్షియల్ ఫ్రాంచైజీల ట్రెండ్‌ను ఓటీటీలోకి తీసుకురావడం ద్వారా సిద్ధార్థ్ ఆనంద్ ఒక కొత్త రిస్క్‌తో కూడిన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బలమైన కథనంతో పాటు స్టార్ అట్రాక్షన్, గ్లోబల్ అప్పీల్ ఉంటే డిజిటల్ వేదికపైనా వందల కోట్ల వ్యాపారం సాధ్యమేనని నిరూపించేందుకు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. మరి `కింగ్` తర్వాత పట్టాలెక్కనున్న ఈ డిజిటల్ `ధూమ్`.. ఓటీటీ చరిత్రలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Tags:    
  • siddharthanand 
  • jewelthief2 
  • netflix 
  • jewelthief 
  • dhoomfranchise 

Similar News

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

Copyright @2026

Powered by Blink CMS