• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరోజుల్లో మాఫియా...

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

| 1981లో వచ్చిన కమల్ హాసన్ ‘ఏక్ దూజే కే లియే’ సినిమా, 2025-26 బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ కంటే పెద్ద హిట్ అని నటుడు రాకేష్ బేడీ అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ ఇఫీ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కొన్ని నగరాల్లో ఈ సినిమా నాలుగైదేళ్ల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమైందని గుర్తుచేశారు.

By - Sivaji Kontham
Update: 2026-11-24 00:34 GMT

సోషల్ మీడియా- డిజిటల్ ప్రచారం అందుబాటులో లేని కాలంలోనే కమల్ హాసన్ ఒకే ఒక్క సినిమాతో ఉత్తరాది సినీ పరిశ్రమను శాసించే స్థాయి సంచలనం సృష్టించారు. తాజాగా గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేదికపై సీనియర్ నటుడు రాకేష్ బేడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నాటి కమల్ హాసన్ క్రేజ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 2025-26 బ్లాక్‌బస్టర్ `ధురంధర్` కంటే.. 1981లో కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ `ఏక్ దూజే కే లియే`చిత్రమే అసలైన అతిపెద్ద హిట్ అని రాకేష్ బేడీ వెల్ల‌డించారు. నేటి తరం ఊహించలేని విధంగా ఆ సినిమా నాలుగైదేళ్ల పాటు కొన్ని నగరాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రకంపనలు సృష్టించింది.

`ఏక్ దూజే కే లియే` భారీ విజయంతో కమల్ హాసన్ రాత్రికి రాత్రే బాలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆయన చార్మింగ్ లుక్.. అద్భుతమైన డ్యాన్స్.. సాటిలేని నట ప్రతిభను చూసి నాటి హిందీ అగ్ర హీరోలు సైతం ఒణికిపోయారంటే అతిశయోక్తి కాదు. దక్షిణాది నుంచి వచ్చిన ఈ నటుడు తమ స్టార్‌డమ్‌ను ఎక్కడ ఎత్తుకెళ్తాడో.. తమను వెనక్కి నెట్టేస్తాడోనని బాలీవుడ్ వర్గాల్లో భయం మొదలైంది. ఆ ఒక్క సినిమాతో కమల్ సృష్టించిన ప్రభంజనం ఎంత తీవ్రంగా ఉందంటే.. అందులో విలన్ ఛాయలున్న `చక్రం` పాత్ర పోషించిన రాకేష్ బేడీకి ప్రేక్షకుల నుంచి ``నీ వల్లే హీరో హీరోయిన్ చనిపోయారు, నిన్ను చంపేస్తాం`` అంటూ బెదిరింపు ఉత్తరాలు వచ్చేంతగా ఆ కథ జనాల్లోకి చొచ్చుకుపోయింది.

ఆ తర్వాత కూడా బాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగించిన కమల్ హాసన్ అండర్‌వరల్డ్ మాఫియా బెదిరింపులను సైతం ఎదుర్కొనేంత స్థాయికి చేరుకున్నారు. 1990వ దశకంలో ముంబై సినీ పరిశ్రమను అండర్‌వరల్డ్ డాన్లు దావూద్ ఇబ్రహీం, అబూ సలేం గ్యాంగ్‌లు శాసిస్తున్న రోజుల్లో... వసూళ్ల కోసం ప్రముఖ స్టార్లందరికీ బెదిరింపు కాల్స్ వచ్చేవి. కమల్ హాసన్ హిందీలో చాచీ 420, హే రామ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తున్న సమయంలో ఆయనకు కూడా మాఫియా నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. అయితే ఏ బెదిరింపులకూ తలొగ్గని కమల్.. ఏమాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు.

మాఫియా బెదిరింపులతో పాటు ముఖ్యంగా `హే రామ్` సినిమా సమయంలో ఎదురైన రాజకీయ, మతపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో ఒకానొక దశలో కమల్ హాసన్ ముంబై పరిశ్రమ నుంచి మకాం మార్చాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. బాలీవుడ్‌లో అగ్ర హీరోగా క్రేజ్ ఉన్నా.. తన ఆత్మగౌరవానికి- కళాత్మక స్వేచ్ఛకు భంగం వాటిల్లే చోట రాజీ పడటానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ముంబైకి దూరంగా వ‌చ్చేసి.. తన సొంత గడ్డపైనే ప్రయోగాత్మక - ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తూ భారతీయ సినిమా స్థాయిని పెంచారు.

`ధురంధర్` వంటి బ్లాక్‌బస్టర్లు సోషల్ మీడియాల సాయంతో ప్రపంచవ్యాప్తంగా దూసుకెళితే.. ఎలాంటి హంగులు లేని ఆ రోజుల్లోనే కమల్ హాసన్ కేవలం తన నట విశ్వరూపంతో దేశాన్ని ఊపేశారు. ఒకవైపు ప్రేక్షకుల పిచ్చి ప్రేమకు.. మరోవైపు ప్రత్యర్థుల అసూయకు.. ఇంకోవైపు మాఫియా బెదిరింపులకు కేంద్రబిందువుగా నిలిచినా ఎక్కడా తలవంచని ధీరుడిగా నిలబడ్డారు.

Tags:    
  • kamalhaasan 
  • ekduujekeliye 
  • rakeshbedi 
  • dhurandhar 

Similar News

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

Copyright @2026

Powered by Blink CMS