• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంత ట్యాలెంట్ చూపించినా...

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

| రజనీకాంత్, విజయ్, ధనుష్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించిన మాళవిక మోహనన్‌కు ఆశించిన స్థాయిలో సోలో హిట్ దక్కలేదు. ప్రభాస్‌తో చేసిన ‘ది రాజా సాబ్’ కూడా విజయాన్ని అందించకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కార్తీతో ‘సర్దార్ 2’, విజయ్ సేతుపతితో ‘పాకెట్ నావెల్’ సినిమాలపై ఆమె ఆశలు పెట్టుకుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-24 00:54 GMT

అందం, అభినయం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా అదృష్టం కలిసిరాకపోతే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో మాళవిక మోహనన్ కెరీర్‌ను చూస్తే అర్థమవుతుంది. మలయాళంలో `పట్టం పోలే` చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ప్రఖ్యాత దర్శకుడు మజీద్ మజీదీ తెరకెక్కించిన `బియాండ్ ది క్లౌడ్స్` సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం రజనీకాంత్ పేట, విజయ్ మాస్టర్, ధనుష్ మారన్, విక్రమ్ తంగలాన్ వంటి భారీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలన్నీ ఈ భామ‌కు గ్లామర్ పరంగా, నటన పరంగా పేరు తెచ్చాయే తప్ప.. సోలోగా కెరీర్‌ను మలుపుతిప్పే భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్లుగా నిలవలేకపోయాయి.

ముఖ్యంగా ప్రభాస్ సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `ది రాజా సాబ్` పై మాళవిక ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించి.. వరుస అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద `రాజా సాబ్` ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం.. నాశిర‌కం కంటెంట్ ఆరోప‌ణ‌ల‌తో మాళ‌విక కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో త‌న‌కు సరైన అవకాశాలు రాకుండా పోయాయి. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఛాన్సులు దక్కకపోవడంతో పాటు.. కోలీవుడ్‌లోనూ ఆశించిన పెద్ద అవకాశాలు తగ్గిపోయాయి.

ప్రస్తుతం మాళవిక మోహనన్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేవీ లేవు. తమిళంలో కార్తీ సరసన నటించిన `సర్దార్ 2` తో పాటు... ప్రస్తుతం త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న `పాకెట్ నావెల్` అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని పెద్ద హీరోలు త‌న‌కు అవకాశాలు ఇవ్వకపోగా.. ఇటు బాలీవుడ్‌లోనూ `యుద్రా` తర్వాత కొత్త ఆఫర్లు ఏవీ తలుపు తట్టడం లేదు. ఎంత టాలెంట్ చూపించినా.. గ్లామర్ ఒలకబోసినా స్టార్ హీరోయిన్ల రేసులో మాళవిక పూర్తిగా వెనకబడిపోయింది.

కేవలం సక్సెస్‌ను మాత్రమే నమ్మే సినీ పరిశ్రమలో ఒక భారీ హిట్ ఇస్తేనే ప్రతిదీ దక్కుతుంది. కానీ ఆ కీలకమైన విజయం మాళవిక మోహనన్‌కు అందనంత దూరంలో ఉండిపోయింది. అద్భుతమైన ప్రతిభ- కష్టపడే తత్వం ఉన్నా అదృష్టం కలిసిరాకపోవడంతో కెరీర్ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. కనీసం త్వరలో రానున్న `పాకెట్ నావెల్` అయినా బ్రేక్ ఇచ్చి.. మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారుస్తుందో లేదో చూడాలి.

Tags:    
  • malavikamohanan 
  • therajasaab 
  • prabhas 
  • sardar2 
  • pocketnovel 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS