• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ నటుడికి టాలెంట్ ఉండి...

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

| నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్‌కు స్టార్ హీరో ఇమేజ్ మాత్రం దక్కలేదు. ‘ప్రస్థానం’, ‘రన్ రాజా రన్’ చిత్రాలతో తనలోని నటనా వైవిధ్యాన్ని చూపించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా స్టార్ హీరోల జాబితాలో చేరుతారా అనేది చూడాలి.

By - Gopi Velupala
Update: 2026-11-24 03:48 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటులు తమ టాలెంట్ ని చూపిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు... కొంతమంది హీరోలు తమ టాలెంట్ ని చూపించినప్పటికి సక్సెస్ లు లేకపోవడంతో వాళ్ళు స్టార్ హీరోలుగా మారే అవకాశం లేకుండా పోతుంది. నిజానికి శర్వానంద్ లాంటి నటుడు కెరియర్ స్టార్టింగ్ లోనే వైవిద్య భరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించాడు. హీరోగా మారిన తర్వాత ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 'ప్రస్థానం' సినిమాలో ఆయన పోషించిన పాత్రకి విమర్శకుల నుంచి ప్రశంశలను అందుకున్నాడు. అలాగే రన్ రాజా రన్ మూవీలో కామెడీ చేస్తూ తనలోని కొత్త యాంగిల్ ను బయటికి తీశాడు. దాంతో నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికి స్టార్ హీరోగా మాత్రం మారలేకపోయాడు. తన వెనకాల వచ్చిన చాలామంది హీరోలు టాప్ పొజిషన్ కి వెళ్ళారు. కానీ శర్వానంద్ ఇప్పటికీ స్టార్ హీరో అనే ట్యాగ్ ను దక్కించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో చేసిన 'భోగి' సినిమా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధించి స్టార్ హీరోల లిస్టులో చేరుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది...

ఇండస్ట్రీలో వాళ్ళకే గుర్తింపు ఉంటుందా?

సినిమా ఇండస్ట్రీలో విజయం సాధించిన హీరోలకు మాత్రమే గుర్తింపు దక్కుతుంది. టాలెంట్ ఎంత ఉన్న సక్సెస్ లేకపోతే వాళ్ళను పట్టించుకునే వారెవరు ఉండరు. అందుకే ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ వెనకాల పరుగెడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో నటన రాని వాళ్లు సైతం మంచి కథలను సెలెక్ట్ చేసుకొని విజయాలు సాధిస్తూ టాప్ హీరోలుగా రాణిస్తారు. కానీ నటనలో పట్టు ఉండి ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించే పోటెన్షియాలిటీ ఉన్న నటులను ఇండస్ట్రీ ఏదో ఒక రోజు టాప్ పొజిషన్ కి తీసుకెళ్తుందని ఇప్పటికి చాలా మంది విషయంలో ప్రూవ్ అయింది. ఇక రాబోయే రోజుల్లో మరి కొంతమంది టాప్ హీరోలుగా మారే అవకాశం ఉంది.

స్టార్ హీరో ట్యాగ్ ఎలా ఏర్పడుతుంది...

హీరోకి ఎప్పుడైతే సక్సెస్ వరిస్తుందో ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఏర్పడుతారు. దానివల్ల అతని సినిమాను మొదటి రోజే చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటి వాళ్లను స్టార్ హీరోలుగా పరిగణిస్తారు...మూవీ కోసం కేటాయించిన బడ్జెట్ లో దాదాపు 25% కలెక్షన్స్ ను మొదటి రోజు రాబట్టే హీరోలు మాత్రమే టాప్ హీరోలుగా గుర్తించబడతారు...

Tags:    
  • sharwanand 
  • bhogi 
  • sampathnandi 
  • tollywood 

Similar News

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

Copyright @2026

Powered by Blink CMS