• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాహిద్.. సైఫ్‌...

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

| బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్ ఆత్మీయంగా కలుసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కరీనా కపూర్‌తో షాహిద్ ప్రేమలో ఉండగా, తర్వాత ఆమె సైఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-24 04:18 GMT

బాలీవుడ్‌లో ఊహించని కలయికలు.. తారల మధ్య కనిపించే స్నేహం అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. తాజాగా షాహిద్ కపూర్ .. సైఫ్ అలీఖాన్ కలిసి కనిపించిన ఓ వీడియో నెట్టింట నెటిజ‌నుల‌ని ఆకర్షిస్తోంది. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని సరదాగా మాట్లాడుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాహిద్ నీలిరంగు స్లీవ్‌లెస్ టీషర్ట్ మ్యాచింగ్ ట్రౌజర్ సన్‌గ్లాసెస్ ధరించి స్టైలిష్‌గా ముస్తాబ‌య్యారు. తలుపు వ‌ద్ద‌ సైఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు షాహిద్ ముఖంలో చిరునవ్వు హైలైట్. వైట్ షర్ట్, లైట్ వాష్ జీన్స్‌లో ఉన్న సైఫ్ ముందుకు వచ్చి షాహిద్‌ను ఆత్మీయంగా హ‌త్తుకోవ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత‌ ఇద్దరూ ప‌క్క‌కు జరిగి ముచ్చటించిన అనంతరం వెళ్లే ముందు మరోసారి కౌగిలించుకోవడం విశేషం.

ఈ కలయిక ఇంతగా చర్చనీయాంశం అవ్వ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ని తెలిసిందే. ఒకప్పుడు కరీనా కపూర్‌తో కొంతకాలం ప్రేమలో ఉన్న షాహిద్ విడిపోయిన తర్వాత మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నారు. మరోవైపు కరీనాను సైఫ్ అలీఖాన్ పెళ్లాడారు. ఈ నేపథ్యంలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌`రంగూన్` చిత్రంలో షాహిద్.. సైఫ్ కలిసి నటించారు. ఆ సమయంలో ఒకరికొకరు వృత్తిపరంగా ప్రశంసలు కురిపించుకున్నారు.

గతంలో అవార్డు వేదికల వద్ద కూడా షాహిద్.. కరీనా ఎంతో హుందాగా మసులుక‌ర‌న్నారు.

ఎంతో స్నేహ పూర్వకంగానే మెలిగారు. ఇటీవలి కాలంలో కరీనా షో `వాట్ ఉమెన్ వాంట్` లో మీరా రాజ్‌పుత్ కూడా కనిపించడం ఆసక్తి కలిగించింది. తాజాగా సైఫ్.. షాహిద్ కూడా ఎలాంటి మొహమాటాలు లేకుండా ఆత్మీయంగా పలకరించుకోవడం బాలీవుడ్ వర్గాల్లోనూ సానుకూల చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్ `ఫర్జీ` రెండో సీజన్‌లో సన్నీ పాత్రతో మళ్లీ సందడి చేయబోతున్నారు. దీంతో పాటు అమిత్ శర్మ దర్శకత్వంలో ఓ కామెడీ డ్రామాలోనూ నటిస్తున్నారు.

భార్యాభర్తలు అనుకోకుండా శరీరాలు మార్చుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ రితేష్ బాత్రా దర్శకత్వంలో `లాంగ్ ఇయర్స్ ఎగో` అనే ఫ్యామిలీ కామెడీ డ్రామాలో నటిస్తున్నారు. 1991 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విద్యా బాలన్, ఫ్రెంచ్ నటి మెలానీ లారెంట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో పాటు కనికా ధిల్లాన్ దర్శకత్వంలో కియారా అద్వానీతో కలిసి ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లోనూ సైఫ్ న‌టిస్తున్నారు.

Tags:    
  • shahidkapoor 
  • saifalikhan 
  • bollywood 
  • rangoon 

Similar News

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

మాస్ సంచ‌ల‌నం వాట్ నెక్స్ట్ ?

2026-11-25 04:39 GMT

మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏమైపోయాడు...

2026-11-25 04:23 GMT

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

Copyright @2026

Powered by Blink CMS