• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన...

మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏమైపోయాడు...

| ‘ఖలేజా’ సినిమాలో తన నటనతో మహేష్ బాబును ఆశ్చర్యపరిచిన నటుడు చైతన్యకు ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఓ ఎమోషనల్ సీన్‌లో గ్లిజరిన్ లేకుండానే సహజంగా కన్నీళ్లు తెప్పించుకున్న అతని నటనను మహేష్ ఓ ఇంటర్వ్యూలో ప్రశంసించారు. అలాంటి ప్రతిభ ఉన్న నటుడికి టాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఎందుకు రావడం లేదంటూ చర్చ జరుగుతోంది.

By - Gopi Velupala
Update: 2026-11-25 04:23 GMT

టాలీవుడ్ స్థాయిని పెంచిన హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాశాయి. 'రాజకుమారుడు' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తో ఎలాగైనా సరే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన మహేష్ బాబు తరువాత చేయబోయే సినిమాకి సంబంధించిన చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి...

మహేష్ గుర్తించిన నటుడు ఎక్కడున్నాడు...

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఖలేజా మూవీ విజయాన్ని సాధించకపోయిన కూడా టీవీల్లో ఆ సినిమాకి ఎక్కువ ఆదరణ దక్కుతుంది. అలాగే ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఖలేజా సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి, కథనంలో ఎక్కడో లోపం జరిగిందని అందువల్లే సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించ లేదంటూ అప్పట్లో కొంతమంది సినిమా మేధావులు వల్ల అభిప్రాయాన్ని తెలియజేశారు. మహేష్ బాబు ఖలేజా సినిమాలో నటిస్తున్నప్పుడు చైతన్య అనే ఆర్టిస్ట్ చనిపోయే సీన్లో మహేష్ బాబు అతనితో ఎమోషనల్ గా మాట్లాడాలి.ఆ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు చైతన్య కళ్ళలో నుంచి వాటర్ రావాలి తను డైలాగ్ కూడా చెప్పాలి. ఇదంతా ఒకే సమయంలో జరగాలి. కండ్లల్లో నుంచి వాటర్ తీయడానికి గ్లిజరిన్ వేసుకోమని మహేష్ బాబు చైతన్యకి చెప్పాడట. దానికి చైతన్య మాత్రం ఒకసారి యాక్షన్ చెప్పగానే ఆటోమేటిక్ గా నా కలలో నుంచి వాటర్ వస్తాయి సార్ అన్నాడట. మహేష్ బాబు అతని కాన్ఫిడెంట్ కి ముచ్చటేసిందట. అలాగే త్రివిక్రమ్ యాక్షన్ చెప్పగానే చైతన్య కండ్లల్లో నుంచి వాటర్ రావడమే కాకుండా ఆయన చాలా ఎమోషనల్ గా ఆ డైలాగ్ చెప్పడంతో మహేష్ బాబు ఒకసారిగా ఆశ్చర్యపోయాడట.

చైతన్య చాలా మంచి ఆర్టిస్ట్ సింగల్ టేక్ డైలాగ్ ను చెప్పగలిగే కెపాసిటీ తనకు ఉందని అలాగే హవాభావాలను సైతం అనుకున్న స్థాయిలో పలికించగలిగే కెపాసిటి కూడా అతనిలో ఉందని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ తన గురించి చెప్పడం విశేషం. ఆ సినిమా తర్వాత ఆయన ఏవో చిన్న పాత్రల్లో కనిపించాడు తప్ప గుర్తుంచుకునే క్యారెక్టర్ మాత్రం చేయలేకపోయాడు. మహేష్ బాబు ఇంటర్వ్యూ చూసిన చాలామంది చైతన్యను ఇతర దర్శకుడు ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అంత మంచి నటుడు ఉన్నప్పుడు ఇతర భాషల నటులను తీసుకురావడం ఎందుకు? అతనికే కొన్ని మంచి క్యారెక్టర్లు ఇస్తే సరిపోతుంది కదా అంటు సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తుండటం విశేషం...

Tags:    
  • maheshbabu 
  • khaleja 
  • trivikram 
  • telugucinema 
  • chaitanya 

Similar News

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

మాస్ సంచ‌ల‌నం వాట్ నెక్స్ట్ ?

2026-11-25 04:39 GMT

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

Copyright @2026

Powered by Blink CMS