• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు...

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

| ‘ఓం శాంతి ఓం’కు ముందు నటన నేర్చుకుంటున్న సమయంలో దీపిక పదుకొణె ఎదుర్కొన్న అనుభవాన్ని అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు. పనిమనిషిలా నేల ఊడ్చే సన్నివేశాన్ని సహజంగా చేయలేక దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారని, పట్టుదలతో సాధన చేసి నటనలో మెళకువలు నేర్చుకున్నారని తెలిపారు.

By - Srikanth Kontham
Update: 2026-11-24 05:43 GMT

భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దీపికా పదుకొణె మోడలింగ్ రంగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే స్టార్ హీరోయిన్ కాక‌ముందు తొలినాళ్లలో సాధారణ పనిమనిషిలా నేల ఊడ్చే సన్నివేశం చేయలేక దీపిక‌ కన్నీళ్లు పెట్టుకున్నారట. ప్రతి పనినీ ఎంతో నాజూకుగా.. స్టైల్‌గా చేసే అలవాటు ఉన్న దీపిక నటనలో సహజత్వం కోసం పడిన కష్టాన్ని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బయటపెట్టారు. త‌న యాక్టింగ్ స్కూల్‌లో దీపిక విద్యార్థినిగా ఉన్న నాటి ఆసక్తికర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన `ఓం శాంతి ఓం` సినిమాకు ఎంపికైన తర్వాత నటనలో మెలకువలు నేర్చుకునేందుకు దీపిక ముంబైలోని అనుపమ్ ఖేర్ సంస్థ `యాక్టర్ ప్రిపేర్స్లో` మూడు నెలల కోర్సులో చేరారు. అప్పటికే పేరున్న మోడల్ కావడంతో టీ కప్పు పట్టుకోవడం మొదలు నడక వరకు ప్రతి పనినీ దీపిక ఎంతో పద్ధతిగా చేసేవారని అనుపమ్ గుర్తు చేసుకున్నారు. అయితే తెరపై పాత్రలు సహజంగా కనిపించాలంటే కృత్రిమ నాజూకుతనం పోవాలని అప్పట్లో దీపిక చేసే పనుల్లో ఆ నమ్మకం కనిపించేది కాదని వివరించారు.

ఒకరోజు క్లాసులో పనిమనిషి వేషంలో చీపురు పట్టుకుని నేల ఊడ్చే సన్నివేశం చేయమని అనుపమ్ దీపికకు సూచించారు. కానీ దీపిక ఆ పనిని కూడా సున్నితంగా మోడల్ తరహా ఛార్మ్‌తో చేయడంతో అనుపమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తమ ఇంట్లో పనిచేసే మహిళను పిలిచి అదే నేలను ఊడ్చి చూపించమని అడగగా? ఆమె ఏమాత్రం తడుముకోకుండా ఎంతో సహజంగా ఊడ్చి చూపించారు. అప్పుడు దీపిక వైపు తిరిగిన అనుపమ్ `నువ్వు నిజంగానే పనిమనిషిలా ఊడుస్తున్నావని నాకు నమ్మకం కలిగే వరకు ఈ ప్రాక్టీస్ చేయిస్తూనే ఉంటాను` అని కఠినంగా చెప్పారుట‌.

గురువు పెట్టిన పరీక్షకు దీపిక మొదట తీవ్ర అసహనానికి గురై కళ్లలో నీళ్లు తిరిగే స్థితికి చేరుకున్నారని అనుపమ్ వెల్లడించారు. అయినా? వెనక్కి తగ్గకుండా పట్టుదలతో అభ్యాసాన్ని పూర్తి చేసి నటనలోని అసలైన లోతును అర్థం చేసుకున్న తర్వాత తనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. నటన అనేది కేవలం అందంగా కనిపించడం కాదని నిరంతర సాధనతో పాత్రలోకి ఒదిగిపోవడమేనని చెప్పేందుకు దీపిక ప్రయాణాన్ని అనుపమ్ ఉదాహరణగా చెప్పారు.

ఆనాటి కఠిన శిక్షణే దీపికను అద్భుతమైన నటిగా తీర్చిదిద్దింది. 2006లో `ఐశ్వర్య` అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన దీపిక‌ 2007లో `ఓం శాంతి ఓం`తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత `కాక్‌టెయిల్`, `యే జవానీ హై దీవానీ`, `చెన్నై ఎక్స్‌ప్రెస్`, `రామ్-లీలా`, `పఠాన్`, `జవాన్`, `కల్కి 2898 AD`, `ప‌ద్మావ‌త్` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్నారు.

ప్రస్తుతం దీపిక.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీలతో కలిసి నటిస్తున్న భారీ చిత్రం `కింగ్` విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తుంద‌ని క్యూరియ‌స్ గా ఉన్నారు.

Tags:    
  • deepikapadukone 
  • anupamkher 
  • omshantiom 
  • bollywood 

Similar News

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?

2026-11-24 05:41 GMT

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS