• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమర్షియల్ సినిమాల్లో ఈ...

కమర్షియల్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ ఉంటే హిట్టు పక్కనా?

| పాటలు, ఫైట్లు, కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, హీరోయిజం కలగలిపి ప్రేక్షకుడికి పూర్తి వినోదాన్ని అందించేదే కమర్షియల్ సినిమా. కథతో పాటు బలమైన ఎమోషన్, హీరో ఎలివేషన్స్, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉంటే సినిమాటిక్ లిబర్టీని కూడా ప్రేక్షకులు అంగీకరిస్తారు.

By - Gopi Velupala
Update: 2026-11-24 06:31 GMT

ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే అన్ని క్రాఫ్ట్ ల వాళ్లు 100% పూర్తి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాల్లో కమర్షియల్ మూవీస్ ముందు వరుసలో ఉంటాయి.

కమర్షియల్ సినిమా అంటే ఏంటి?

ఒక సినిమాలో పాటలు, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, హీరోయిజం, విలనిజం, భారీ బడ్జెట్, సాంకేతిక అంశాలు, ఎలివేషన్స్ అన్నింటినీ సమపాళ్ళలో మిళితం చేసి సినిమా చూసే ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే కమర్షియల్ సినిమా ఫార్ములా...

కమర్షియల్ హిట్లు కొట్టాలంటే ఇవి ఉండాల్సిందే...

ఒక సినిమా కమర్షియల్ సక్సెస్ ని సాధించాలంటే కథ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి. నిజానికి కమర్షియల్ సినిమాలో హీరోకి కొన్ని ప్రత్యేకమైన శక్తులుంటాయి. అతను కొడితే ముగ్గురు ఒకేసారి గాల్లోకి ఎగిరి కిందపడాలి. సినిమా చూసే ప్రేక్షకుడు స్క్రీన్ మీద కనిపించే హీరోలో తనను తాను ఊహించుకుంటాడు కాబట్టి అక్కడ హీరో తనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ను ఈజీగా సాల్వ్ చేస్తుండాలి. అలాంటివి చూసినప్పుడే ప్రేక్షకుడు ఒక హై ఫీల్ కి లోనవుతాడు. తను చేయలేని పనులను హీరో చేస్తున్నాడు. కాబట్టి హీరోలో తనను తాను ఊహించుకుంటాడు. మనం కూడా అలాంటి పనులు చేస్తున్నాం అనే ఇమాజినేషన్ లోకి ప్రేక్షకుడు వెళ్లిపోతాడు. అతన్ని ఆ హై లోనే ఉంచుతూ సినిమాలోని కోర్ ఎమోషన్ ను ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో కనెక్ట్ అయ్యేలా తీసుకెళ్తే సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది.

సినిమాటిక్ లిబర్టీ...

కమర్షియల్ సినిమాల్లో కొన్ని లాజిక్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానిని సినిమా పరిభాషలో 'సినిమాటిక్ లిబర్టీ' అంటారు... కొన్ని సందర్భాల్లో దర్శకులు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని లాజిక్స్ ని పక్కన పెట్టి సినిమాలను ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రేక్షకులు సైతం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడంలో తప్ప ఏం లేదు అన్నట్టుగా కమర్షియల్ సినిమాలు చూసేటప్పుడు వాటన్నింటిని సర్దుబాటు చేసుకుంటారు. మొత్తానికైతే కమర్షియల్ సినిమాతో సక్సెస్ ని సాధించడం ఈజీనే కానీ ప్రేక్షకులందరికీ కనెక్ట్ చేసేలా కథని తీర్చిదిద్ది అందులోని ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అవి కనక కరెక్ట్ గా కుదిరితే ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం పెద్ద కష్టమైతే కాదు...

Tags:    
  • commercialcinema 
  • telugucinema 
  • commercialmovies 
  • cinematicliberty 

Similar News

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

సీతమ్మ‌ పాత్ర‌ను నితీష్ పున‌రాలోచించాల్సిందే!

2026-11-24 06:30 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?

2026-11-24 05:41 GMT

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

Copyright @2026

Powered by Blink CMS