• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెపోలియన్..స్టాలిన్‌లకు...

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

| సినిమాల్లో కండలు తిరిగిన హీరోలనే బలవంతులుగా చూపిస్తారని, నిజజీవితంలో అధికారం మాత్రం సాధారణ శరీరాకృతి ఉన్నవారి చేతుల్లోనూ ఉంటుందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నెపోలియన్, స్టాలిన్, అల్ కపోన్ వంటి వ్యక్తులను ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణేతో ‘పోలీస్ కంపెనీ’ తెరకెక్కిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-24 09:49 GMT

తెరపై కనిపించే బలమైన పాత్రలకు నిజజీవితంలో అధికారాన్ని చెలాయించే వ్యక్తులకు చాలా తేడా ఉంటుందని సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విశ్లేషించారు. కండలు తిరిగిన శరీరం.. సిక్స్ ప్యాక్‌తో హీరోలు కనిపిస్తేనే వారే శక్తిమంతులన్నట్లు సినిమాల్లో చూపిస్తారని కానీ వాస్తవ ప్రపంచంలో అలా ఉండదని స్పష్టం చేశారు. ఎక్స్ ఖాతాలో ఈ అంశంపై వ‌ర్మ సుదీర్ఘమైన పోస్ట్ పంచుకుంటూ నెపోలియన్.. స్టాలిన్ వంటి చారిత్రక ఉదాహరణలను ప్రస్తావించారు.

`బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక దాక్కునే మొండి హీరోల విచిత్రం` అనే శీర్షికతో రాసిన ఆ పోస్ట్‌లో.. `బాహుబలి` కాలం నుంచి లేదా అంతకుముందు నుంచైనా కొన్ని సినిమాలు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నాయని ఆర్జీవీ అన్నారు. సినిమాల్లో కండల బలం ఉన్నవారే బలవంతులని చూపిస్తారు కానీ.. నిజజీవితంలో అధికారం ఉన్నవారికి అలాంటి కండరపుష్టి ఏమీ ఉండదని పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో సిక్స్ ప్యాక్ దృఢమైన దేహం ఉన్నవారు.. సన్నగా, పొట్టిగా, బక్కచిక్కి లేదా బొద్దుగా ఉండే బాస్‌ల కింద పనిచేస్తూ ఉంటారని రాసుకొచ్చారు.

సినిమాల్లో కండలు చూపించే వ్యక్తి నిజజీవితంలో మాత్రం జిమ్ మొఖమే ఎరగని..పొట్టతో ఉండే బాస్ వెనుక నిలబడి ఆయన ఇచ్చే జీతంతో బతికే స్థితిలో ఉంటాడని చురకలంటించారు. తన వాదనకు బలం చేకూర్చేలా చరిత్రలోని ప్రముఖులను ఆర్జీవీ ఉదాహరించారు. నెపోలియన్ కేవలం 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు సాధారణ శరీరాకృతితో ఉన్నా? ఐరోపాలోని ఎంతోమంది బలవంతులు ఆయన ఆదేశాల మేరకు పనిచేశారని గుర్తు చేశారు.

అలాగే ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండే స్టాలిన్ శరీరాకృతి కూడా సాధారణంగానే ఉండేదని..కానీ ఆయన ఆదేశాలను పాటించే సైనిక, భద్రతా అధికారులు మరింత దృఢంగా ఉన్నా? వారందరినీ శాసించే అధికారం స్టాలిన్ చేతిలోనే ఉండేదని వివరించారు. మాఫియా ప్రపంచం, భారతీయ రాజకీయాలను కూడా ఈ సందర్భంగా ఆర్జీవీ ప్రస్తావించారు. అల్ కపోన్ నుంచి పాబ్లో ఎస్కోబార్, దావూద్ ఇబ్రహీం వరకు ఎవరికీ సినిమా హీరోల్లాంటి బాడీలు లేవని.. వారి తరఫున హింసకు దిగేవారే శారీరకంగా దృఢంగా ఉండేవారని కానీ వారే అతి తక్కువ వేతనం తీసుకుంటూ సులభంగా పక్కన పెట్టబడేవారని అన్నారు. రాజకీయాల్లోనూ శక్తిమంతమైన నేతల పక్కన కండలు తిరిగిన బాడీగార్డులు కనిపిస్తుంటారని.. సైన్యంలోనూ ఆదేశాలిచ్చే అధికారుల కంటే ఆదేశాలు పాటించే సైనికులే శారీరకంగా ఫిట్‌గా ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఇక ఆర్జీవీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో `పోలీస్ కంపెనీ` అనే క్రైమ్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, మకరంద్ దేశ్‌పాండే, అశ్విని కల్సేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 2027 లో విడుదల కానుంది.

Tags:    
  • ramgopalvarma 
  • rgv 
  • sixpackheroes 
  • policecompany 

Similar News

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

రుహానీ శర్మ డైలాగ్స్‌పై పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-24 09:47 GMT

షారుఖ్‌కు హాలీవుడ్ దెబ్బ.. కింగ్‌కు ఓ టెన్షన్!

2026-11-24 08:32 GMT

పెద్ద హీరోలు లేకుండానే క్రేజ్ కొట్టేస్తున్నారు

2026-11-24 08:32 GMT

పేదింటి బిడ్డకు కోటి రూపాయల జాక్‌పాట్!

2026-11-24 08:31 GMT

రాజమౌళి ఎఫెక్ట్.. త్రివిక్రమ్‌కూ అదే ఇబ్బంది!

2026-11-24 08:30 GMT

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!

2026-11-24 08:29 GMT

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS