• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రమశిక్షణ..కఠిన డైట్‌తో...

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

| ‘రామాయణం’లో రావణుడి పాత్ర కోసం యశ్ ప్రత్యేకమైన డైట్, ఫిట్‌నెస్ రొటీన్ పాటించినట్లు సమాచారం. ఎనిమిది గుడ్ల తెల్లసొన, చేపలు, పండ్లు, ప్రోటీన్ షేక్స్‌తో పాటు రోజుకు రెండుసార్లు వ్యాయామం చేస్తారట. ఇక ‘రామాయణం పార్ట్ 2’లో యశ్ అసలు రావణుడి రూపం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-24 09:48 GMT

`కన్నడ స్టార్ యశ్ `రామాయణం మొద‌టి పార్ట్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో య‌ష్ పోషించిన రావణుడి పాత్రకు తెరపై కనిపించిన గంభీరమైన రూపం, దృఢమైన దేహ దారుఢ్యానికి స‌ర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి పవర్‌ఫుల్ ఫిజిక్‌ను నిలబెట్టుకోవడం వెనుక యశ్ పాటించిన కఠినమైన డైట్.. వర్కౌట్ దినచర్య సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

యశ్ రోజును కార్బోహైడ్రేట్లు.. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే భారీ అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్ కలిపిన పెద్ద బౌల్ పోషకాహారం.. ఐదు బ్రౌన్ బ్రెడ్ స్లైసులు.. ఎనిమిది గుడ్లలోని తెల్లసొనతో పాటు కూరగాయలు.. పుచ్చకాయ.. బొప్పాయి పండ్లను చేర్చుకుంటారట. ఉదయం 11 గంటల సమయంలో ప్రోటీన్ షేక్ తీసుకుంటారు. ప్రోటీన్ కోసం ఆహారంలో చేపలను కూడా తప్పనిసరిగా భాగం చేసుకుంటారు.

సాయంత్రం జిమ్‌కు వెళ్లే ముందు యశ్ నాలుగు బ్రౌన్ బ్రెడ్ స్లైసులు.. నాలుగు అరటిపండ్లు తింటారని సమాచారం. రాత్రి భోజనాన్ని మాత్రం తేలికగా తీసుకుంటారు. అందులో తగినంత ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారు. శుభ్రమైన సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం య‌శ్ అలవాటు. వర్కౌట్ల విషయానికొస్తే యశ్ రోజుకు రెండుసార్లు కసరత్తులు చేస్తారు. క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను పాటిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే వ్యాయామంలో వెయిట్ ట్రైనింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా ?వర్కౌట్ సెషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయరని.. స్థిరత్వమే అసలైన విజయమని యశ్ బ‌లంగా నమ్ముతారు.

సాధార‌ణంగానే య‌శ్ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తారు. రావ‌ణుడి లుక్ కోసం మ‌రింతం శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఆహార్యం లో ర‌క‌ర‌కాల మార్పులు కోర‌డంతో అందుకు త‌గ్గ‌ట్టు బ‌రువు పెర‌గ‌డం...త‌గ్గ‌డం వంటివి జ‌రిగాయి. య‌శ్ అస‌లైన రూపం `రామాయ‌ణం పార్టు 2` లో ఉంటుంది. శ్రీరాముడితో త‌ల‌ప‌డ‌టం..లంక ద‌హ‌నం వంటి స‌న్నివేశాల్లో లంకేశ్వ‌రుడి రియాక్ష‌న్ ఎలా ఉంటుందో? చూడాలని అభిమానులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే య‌శ్ హీరోగా త‌దుప‌రి ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.గ‌త సినిమా `టాక్సిక్` ప‌రాజ‌యం చెంద‌డంతో ద‌ర్శ‌కుల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ కు త‌గ్గ క‌థ‌.. ద‌ర్శ‌కుడు కోసం వెతు కుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాదిలో ఆ వివ‌రాలు కూడా తెలిసే వ‌కాశం ఉంటుంది.

Tags:    
  • yash 
  • ramayana 
  • ravanarole 
  • yashfitness 

Similar News

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

రుహానీ శర్మ డైలాగ్స్‌పై పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-24 09:47 GMT

షారుఖ్‌కు హాలీవుడ్ దెబ్బ.. కింగ్‌కు ఓ టెన్షన్!

2026-11-24 08:32 GMT

పెద్ద హీరోలు లేకుండానే క్రేజ్ కొట్టేస్తున్నారు

2026-11-24 08:32 GMT

పేదింటి బిడ్డకు కోటి రూపాయల జాక్‌పాట్!

2026-11-24 08:31 GMT

రాజమౌళి ఎఫెక్ట్.. త్రివిక్రమ్‌కూ అదే ఇబ్బంది!

2026-11-24 08:30 GMT

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!

2026-11-24 08:29 GMT

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS