• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి...

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

| బాలీవుడ్ నటుడు జితేంద్ర తన కుమారుడు తుషార్ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుషార్ తనకంటే గొప్ప నటుడని ప్రశంసించారు. తనకు సరైన సమయంలో అదృష్టం కలిసిరావడంతో స్టార్ అయ్యానని తెలిపారు. మరోవైపు, తుషార్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గోల్‌మాల్ 5’లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్ సేవా కార్యక్రమాలు చూసి తండ్రిగా గర్వపడుతున్నానని జితేంద్ర అన్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-24 12:45 GMT

బాలీవుడ్ సీనియ‌ర్ కథానాయకుల్లో జితేంద్ర స్థానం ప్రత్యేకమైనది. తనదైన శైలి డ్యాన్స్ స్టెప్పులతో.. తెల్లటి దుస్తులు.. షూస్‌తో ప్రత్యేక ట్రెండ్ సృష్టించి జంపింగ్ జాక్ ఆఫ్ బాలీవుడ్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్‌డమ్ అనుభవించిన ఓ లెజెండ్. తాజాగా కుమారుడు తుషార్ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి స్థాయిలో తుషార్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్న వేళ జితేంద్ర మాత్రం తనకంటే తుషార్ మెరుగైన, నటుడని ప్రశంసించారు.

తుషార్ కెరీర్ విజయాలతో పోల్చి అడిగిన ప్రశ్నకు జితేంద్ర నిరాడంబరంగా స్పందించారు. కుమారుడు కాబట్టి ఈ మాట చెప్పడం లేదని నిజంగానే తుషార్ తనకంటే గొప్ప నటుడ‌న్నారు. తనకు సరైన సమయంలో అదృష్టం కలిసి రావడం వల్లే స్టార్ అయ్యాన‌న్నారు. దిగ్గజ దర్శకుడు వి. శాంతారామ్ గుర్తించి హీరోగా అవకాశం ఇవ్వకపోయి ఉంటే పరిస్థి మ‌రోలా ఉండేద‌ని గుర్తు చేసుకున్నారు. 1964లో శాంతారామ్ తెరకెక్కించిన `గీత్ గాయా పత్తరోం నే` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జితేంద్ర `ఫర్జ్` సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు.

70- 80వ దశకాల్లో `కారవాన్`, `ధరమ్ వీర్`, `హిమ్మత్‌వాలా`, `తోఫా` వంటి ఎన్నో వాణిజ్య విజయాలను ఖాతాలో వేసుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. పిల్లల పెంపకం..కెరీర్ గురించి స్పందించారు. తుషార్ చిన్న ప్పటి నుంచీ ఏకాగ్రత ఉన్న అబ్బాయి అని తన సలహాలు ఎప్పుడూ అవసరం పడలేదని జితేంద్ర తెలిపారు. నిజానికి చిన్నప్పుడు తనకు ఎక్కువగా కూతురు ఏక్తా కపూర్ గురించే ఆందోళన ఉండేదన్నారు. అప్పట్లో కేవలం తినడమే పనిగా పెట్టుకునేదని తమ్ముడి టిఫిన్ బాక్స్ కూడా ఖాళీ చేసేదని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అలాంటి ఏక్తా ఈరోజు ఇంతటి స్థాయికి ఎదగడం ఎవరికీ తెలియకుండా వృద్ధాశ్రమం నడుపుతూ సేవా కార్యక్రమాలు చేయడం చూస్తుంటే తండ్రిగా ఎంతో గర్వంగా ఉందన్నారు .

ప్రస్తుతం నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్ వ్యాపారంలో తుషార్‌ను కూడా భాగస్వామిని చేసినట్లు జితేంద్ర తెలిపారు. `ముఝే కుఛ్ కెహనా హై` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తుషార్ ఆ తర్వాత `ఖాకీ`, `షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా`, `ది డర్టీ పిక్చర్` వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా `గోల్‌మాల్` ఫ్రాంచైజీలో మూగవాడైన లక్కీ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `గోల్‌మాల్ 5` సినిమాతో తుషార్ బిజీగా ఉన్నారు.

Tags:    
  • jeetendra 
  • tussharkapoor 
  • ektakapoor 
  • bollywood 
  • golmaal5 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS