• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  సీట్లు పెరగకపోతే కూటమికి...

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలతో కూటమి పార్టీల మధ్య అంతర్గత అసంతృప్తి బయటపడుతోంది. బీజేపీ, జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు పెరిగితే సమస్య సులభమవుతుందని, లేదంటే పొత్తుల సర్దుబాటు కష్టమవుతుందని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-24 18:22 GMT

మిత్రుల గొంతులలో అసంతృప్తి వినిపిస్తోంది. అది మెల్లగా కూటమి ఐక్యతా రాగంలో అపశృతిని సవరిస్తోంది. ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదు అని అంటారు. అలా కూటమిలో మిత్రులు ముగ్గురూ అంతా బాగానే ఉంది అని ఇప్పటిదాకా అనుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ బయటపడ్డాయని అంటున్నారు. పై స్థాయిలో ఉన్నంత సఖ్యత సరాగం కింద స్థాయిలో లేదు అన్నది నెమ్మదిగా బోధపడుతోంది అని అంటున్నారు. అంతే కాదు కీలక ఎమ్మెల్యేలు సైతం మిత్ర పార్టీల నుంచి తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. కూటమి ధర్మం అని సర్దుకుని పోతున్నాం అంటూ విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సన్నాయి నొక్కులు నొక్కినా వచ్చే ఎన్నికల్లో మాకేమి సీట్లు ఇస్తారో అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సందేహం వ్యక్తం చేసినా ఇవన్నీ అసంతృప్తులకు సంకేతాలే అంటున్నారు. ఇక జనసేన నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల వేళ చాలా చోట్ల బాహాటం అయ్యారని అంటున్నారు.

మరింత సక్లిష్టంగా :

ఇక చూస్తే మరో రెండున్నరేళ్ళలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అంతే కాదు ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో కూటమి మిత్రులు అంతా కలసికట్టుగా ఒక్కటిగా వెళ్లాల్సి ఉంది. అలా తామంతా ఒక్కటే అని మరోసారి జనం ముందుకు రావాల్సి ఉంది. అయితే దిగువ స్థాయిలో క్యాడర్ లో ఉన్న అసంతృప్తి మిత్ర పార్టీల అధినాయకత్వాలకు సెగలుగా తగులుతున్న వేళ అనుకున్న విధంగా సీట్ల పంపకాలు అపుడు జరుగుతాయా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. పైగా ఏ ఎన్నికకు ఆ ఎన్నిక అన్నట్లుగా బలపడాలని బీజేపీ జనసేన చూస్తున్న వేళ వారికి గ్రౌండ్ లెవెల్ లో మరింత మంది ప్రజా ప్రతినిధులు కూడా కొత్తగా వచ్చి చేరారు. దాంతో ఇంతకు ఎక్కువగానే సీట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2024 లో జనసేన బీజేపీకి కలిపి 31 సీట్లతో సరిపెట్టారు. కానీ ఈసారి అలా కుదిరే వ్యవహారం లేదని అంటున్నారు.

ఒత్తిడి పెరిగిపోతోంది :

జనసేనకు అయితే పొత్తులలో ఉన్నా కూడా తమ బలానికి తగినట్లుగా న్యాయమైన వాటా తీసుకోవాలని ఒత్తిడి ఉంది. అలాగే బీజేపీ విషయం తీసుకుంటే తమకు అన్యాయం జరుగుతోంది అని క్యాడర్ నుంచి కీలక నేతల దాకా ఒక్కటే సౌండ్ వినిపిస్తోంది. వీటన్నింటి మధ్యన చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం అయితే కూటమిని వరించింది. చంద్రబాబు చెబుతున్నట్లుగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధ్యపడింది. కానీ ఇదే తీరు 2029 ఎన్నికల్లో ఉంటుందా అంటే ఎవరూ చెప్పలేరని అంటున్నారు. ఎందుకంటే అప్పటికి మరింతగా రెట్టింపు అయిన ఆశలతో మిత్ర పార్టీల నేతలు ఉంటారని అంటున్నారు.

డీలిమిటేషన్ మీదనే :

ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు మీదనే కూటమి ఆశలు ఉన్నాయని అంటున్నారు. ఆ బిల్లు కనుక పార్లమెంట్ లో ఆమోదం పొందితే ఉన్న అసెంబ్లీ సీట్లకు అదనంగా మరో యాభై శాతం జమ అవుతుంది. అపుడు ఏపీలో 263 సీట్లు అసెంబ్లీకి వస్తాయి. ఆ విధంగా సీట్లు పెరిగితే కనుక కూటమి పార్టీలు హ్యాపీగా సర్దుబాటు చేసుకుని ముందుకు సాగిపోతాయి. మిత్రులు కోరిన విధంగా ఎక్కువ సీట్లు వస్తాయి. అయితే అలా కాకుండా ఇదే తీరున 175 సీట్లతోనే మరోసారి ఎన్నికలకు అంటే మాత్రం అది ఇబ్బందికరమే అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • andhrapradeshpolitics 
  • tdp 
  • janasena 
  • bjp 
  • chandrababu 
  • pawankalyan 

Similar News

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

2026-11-24 08:43 GMT

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

Copyright @2026

Powered by Blink CMS