వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?
| విజయవాడ మేయర్‌గా ప్రమాణ స్వీకారం సందర్భంగా వంగవీటి రాధా తన పూర్తి పేరు ‘వంగవీటి రాధాకృష్ణన్’ అని పలకడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. చిన్నప్పుడు ఊటీలో చదువుకున్న సమయంలో పాఠశాల రికార్డుల్లో తమిళ శైలిలో పేరు చివర ‘న్’ చేరింది. అప్పటి నుంచి విద్యా ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్, ఎన్నికల అఫిడవిట్లలో అదే పేరు కొనసాగుతోంది. అందుకే ప్రమాణ స్వీకారంలో అధికారిక పేరును ఉపయోగించారు.
వంగవీటి రాధా క్రిష్ణ అంటే అందరికీ తెలుసు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా 2004లో గెలిచిన రాధా క్రిష్ణ దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు అన్నది ఇంకా బాగా తెలుసు. షార్ట్ కట్ లో రాధా అని కూడా బాగా పాపులర్. కానీ విజయవాడ మేయర్ గా ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు తన పేరు వంగవీటి రాధాకృష్ణన్ అని పలికారు. దాంతో సభలో ఉన్న వారు ఏమిటి ఆయన తప్పు చదువుతున్నారా లేక తాము తప్పుగా విన్నామా అన్న డౌట్ లో పడిపోయారు. అయితే రాధా తన పేరుని కరెక్ట్ గానే చదివారు అని అంతా కరెక్ట్ గానే విన్నారు అన్నది తరువాత తెలిసింది. మరి రాధా క్రిష్ణ అన్న తెలుగు పేరు కదా ఈ తమిళ్ కలిసిన క్రిష్ణన్ అన్న పేరు ఎలా వచ్చింది అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఈ పేరు వెనక ఒక స్టోరీ ఉంది. అది ఇంట్రెస్టింగ్ గానే ఉంది.
ప్రభుత్వ రికార్డులలో :
జనాలందరికీ రాధా క్రిష్ణగా పేరుతో పరిచయం ఉన్నా ఆయన పూర్తి పేరు వంగవీటి రాధాక్రిష్ణన్. అలాగే ఆయన పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. అందుకే విజయవాడ నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వంగవీటి రాధాకృష్ణన్ అనే నేను అని పలికారు. అయితే ఈ కొత్త పేరుపై చర్చ అంతటా మొదలైంది. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఉంది. స్కూల్ రికార్డుల ప్రకారం అదే పేరు ఉంది. రాధా తల్లిదండ్రులు మొదట వంగవీటి రాధాకృష్ణ అనే పేరు పెట్టారు. అది రాధా పెద నాన్న పేరు. అయితే రాధాని ఆయన చిన్నతనంలో తమిళనాడులోని ఊటీలో పాఠాశాలలో చదివించారు. అలా ఆయన చదువుకునే సమయంలో అక్కడ పాఠశాల అధికారులు తమిళ శైలిలో ఆయన పేరు చివర 'న్' చేర్చి రాధాకృష్ణన్ గా స్కూల్ రికార్డులలో నమోదు చేశారు.
అదే పేరు కొనసాగుతోంది :
ఆ తరువాత అదే కొనసాగుతూ అధికారిక ధృవపత్రాలలోనూ ఉంది. అప్పటి నుంచి ఆయన చదువుకున్న సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, ఎన్నికల అఫిడవిట్లు ఇతర ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ అదే పేరు కొనసాగుతోంది. ఇక బయట ప్రజలకు, రాజకీయ వర్గాలకు ఆయన వంగవీటి రాధా లేదా రాధాకృష్ణగా సుపరిచితులైనప్పటికీ, చట్టపరమైన నిబంధనల ప్రకారం మేయర్ ప్రమాణ స్వీకారంలో తన అధికారిక పేరునే ఉపయోగించారు. అదన్న మాట సంగతి. మొత్తం మీద చూస్తే వంగవీటి రాధా క్రిష్ణన్ అన్నది ఆయన అసలు పేరు అని మేయర్ ప్రమాణం సందర్భంగా అంతా సరి కొత్తగా తెలుసుకున్నారు. దేశ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాక్రిష్ణన్ ఉన్నారు. అలాగే . ఇపుడు విజయవాడ మేయర్ గా రాధాక్రిష్ణన్ ఉన్నారు అని అంతా అంటున్నారు. తమిళనాడులో పుట్టి దేశానికి రాష్ట్రపతి అయిన రాధాక్రిష్ణన్ స్పూర్తితో అనేక మంది ఆ పేరుని పెట్టుకుంటారు ఇది ఎక్కువగా తమిళనాడులో జరుగుతుంది.