• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  మేయర్లు చైర్మన్లు రేపటి...

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

| ఏపీలో మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లతో జిల్లాల్లో కొత్త నాయకత్వం ఏర్పడింది. అభివృద్ధి పనులతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల రేసులో వీరు కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే ఆధిపత్య పోరుకు తావివ్వకుండా పనితీరుపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-24 02:30 GMT

ఏపీలో మొత్తానికి జిల్లాలలో పటిష్టమైన నాయకత్వం ఏర్పడింది. పాలకవర్గంగా ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా ప్రతినిధులు అందుబాటులోకి వచ్చినా రాజకీయ పార్టీల వరకూ చూస్తే వారికి గ్రౌండ్ లెవెల్ దాకా పార్టీలో బలమైన నాయకత్వం ఏర్పడినట్లుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా చూస్తే ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, అలాగే 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అత్యధికంగా 164 ఎమ్మెల్యేలు, అలాగే 21 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో ఏపీ అంతటా కూటమి బాగా పరచుకుంది. ఇక చూస్తే ఇప్పటిదాకా జిల్లాలలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్యనే అధికార కేంద్రాలు తిరిగాయి. కానీ ఇపుడు ప్రతీ జిల్లాలో మరిన్ని అధికార కేంద్రాలు వచ్చాయి. దాంతో పాటు వందల్లో ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రాలలో కొలువు తీరారు.

వారికి ధీటుగానే :

మేయర్లు జెడ్పీ చైర్మన్లు తీసుకుంటే ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంపీలకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం ఉంటే అటూ ఇటూగా వీరు అలాగే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలలో మేయర్లు, జిల్లా పరిషత్తు చైర్మన్లు కీలక పాత్ర పోషిస్తారు అన్నది వాస్తవం. విశాఖ లాంటి కార్పోరేషనల్లో అయితే ఏకంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మేయర్ ఎన్నుకోబడ్డారు. అలాగే 5 వేల తో ప్రతీ ఏటా వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టే అధికార హోదాలో ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచినందువల్ల వారికి పదవి విషయంలో ఎలాంటి బెంగ బెదురు లేదని అంటున్నారు. జెడ్పీ చైర్మన్లు వందల కోట్ల బడ్జెట్ ని ఏటా ప్రవేశపెడతారు. ఇలా పవర్ ఫుల్ సెంటర్లుగా జిల్లా కేంద్రాలో వీరంతా ఉంటున్నారు అన్నది వాస్తవం.

రేసులో మరింతమంది :

కొత్త నాయకత్వం అంతా గ్రౌండ్ లెవెల్ నుంచే వస్తుంది. అలా చూస్తే జిల్లా స్థాయిలో మున్సిపల్ చైర్మన్ల దాకా వెళ్తే అక్కడ నుంచే నూతన నాయకులను బాగా సమర్ధంగా పనిచేసిన వారిని ఎంపిక చేసుకునే వీలు కూడా ఆయా పార్టీల అధినాయకత్వాలకు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఎటూ ఉంటుంది కాబట్టి తమ పనితీరుతో వీరంతా జనంలో మెప్పు సాధించి అధినాయకత్వం వద్ద మంచి మార్కులు పొందేందుకు వీలు అవుతుంది అని అంటున్నారు. సర్పంచ్ గా పనిచేసిన వారిని కూడా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఎంతో కీలక స్థానాలలో ఉంటూ ప్రజలతో మమేకం అయిన ఈ ప్రజా ప్రతినిధుల నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రేసులో ఉంటారు అన్నది ఇపుడే చెప్పడం కష్టమైనా కచ్చితంగా వారి నుంచి సిట్టింగులకు గట్టి పోటీ ఉంటుంది అన్నది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటగా ఉంది.

పనితీరులోనే :

అయితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండడం వల్ల అభివృద్ధిలో మరింతగా జనంలో దూసుకునిపోయి ప్రభుత్వానికి పేరు తేవడంలో పోటీ పడితే మేలు జరుగుతుంది అని అంటున్నారు. అదే సమయంలో ఆధిపత్య పోరుకు తెర తీస్తే కనుక ఇబ్బంది అవుతుందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని వార్తలు ఉన్నాయి. ఇపుడు కొత్తగా వచ్చినా జిల్లా స్థాయిలోని అధికార కేంద్రాలతో ఈ రకమైన పేచీ పూచీలు రాకుండా చూసుకుంటూ ఎవరి సామర్థ్యం వారు చూపిస్తే అటు జనాలు ఇటు అధినాయకత్వాలు 2029 నాటికి ఎవరిని ఏ విధంగా సమాదరిస్తారో చూసుకోవచ్చు అన్నది కూడా ఉంది.

Tags:    
  • appolitics 
  • mayors 
  • zillaparishad 
  • localbodyelections 

Similar News

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

2026-11-24 00:27 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

2026-11-24 00:25 GMT

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

2026-11-24 00:23 GMT

డిప్యూటీలలో కూటమి హవా...వైసీపీకి రెండే !

2026-11-23 17:45 GMT

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి రాజకీయాల వైపు.. 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా ‘చార్పిత’ చరిత్ర

2026-11-23 17:30 GMT

వైసీపీలో నెంబర్‌-3... ఫోక‌స్ ఆ వ‌ర్గంపైనేనా.. !

2026-11-23 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS