• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఇంట్లోనే...

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

| 2029 ఎన్నికలకు వైసీపీ బలాన్ని పెంచుకోవాల్సిన సమయంలో జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం రాజకీయంగా పార్టీకి ఇబ్బందిగా మారుతోందనే చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో రాయలసీమలోనూ వైసీపీ వెనుకబడటానికి షర్మిల విమర్శలు కొంత ప్రభావం చూపాయని విశ్లేషణలు వచ్చాయి. 2029లోనూ ఈ వివాదం కొనసాగితే జగన్ ఇమేజ్‌తో పాటు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

By - Satya P
Update: 2026-11-24 00:55 GMT

వైసీపీ అధినేత జగన్ కి 2029 ఎన్నికలు మరోసారి పెను సవాల్ గా మారనున్నాయా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. గ్రాఫ్ బాగా పెరగాలి. అదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా పెరగాలి. 2029 ఎన్నికలకు సగం కాలమే ఉంది. ఈ క్రమంలో వైసీపీ పూర్తి స్థాయిలో తన బలాన్ని పెంచుకుని అధికార పార్టీ మీద టార్గెట్ చేయాల్సి ఉంది. తన రాజకీయ పోరాటాన్ని ఉధృతంగా కొనసాగించాల్సి ఉంది. అయితే వైసీపీలో మాత్రం చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు. వైసీపీకి అధినేత ఇంటి పోరు తలనొప్పిగా మారుతోంది అని అంటున్నారు.

జగన్ వ్యక్తిగతం అయినా :

ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగతంగానే పోరు ఉన్నా కూడా దాని ప్రభావం పార్టీ మీద కూడా పడుతోంది అని అంటున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ఆస్తి తగాదాలు కాస్తా రాజకీయంగా కూడా మారి ప్రకంపనలు రేపుతున్నాయి. ఇది ఏపీలో అధికార పార్టీకి అందుకొచ్చిన అస్త్రంగా మారుతోంది. దాంతో వైసీపీలో దీని మీద చర్చ సాగుతోంది. నిజానికి ప్రతీ కుటుంబంలో సొంతంగా వివాదాలు ఉంటాయి. కానీ వాటిని బాహాటం చేయడం వల్ల రాజకీయంగా పార్టీలు ఇరుకున పడుతున్నాయని అంటున్నారు. షర్మిల జగన్ ఇష్యూ అయితే ఆస్తుల వివాదాలను మించి మరింతగా పెరిగిపోతోంది అని అంటున్నారు.

రాయలసీమలో దెబ్బ :

ఇక చూస్తే ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఏమీ లేదు. అయితే వైఎస్సార్ కుమార్తెగా షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక ఆమె నేరుగా వైసీపీ మీదనే తన విమర్శలు చేస్తూ జగన్ ని గట్టిగా టార్గెట్ చేయడం వల్ల భారీగానే ఆ పార్టీ నష్టపోయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే లభించి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకపోవడం అంటే వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన సీమలోనే ఆ పార్టీ వెనకబడిపోయింది అని అంటున్నారు. అందువల్లనే వైసీపీకి భారీ షాక్ ఎదురైంది అని ఆనాడే విశ్లేషించారు. దానికి కారణం ఒక ఆడబిడ్డగా షర్మిల ఆనాడు జగన్ కి వ్యతిరేకంగా చేసిన పోరాటం జనంలోకి బలంగా వెళ్లడమే అని గుర్తు చేస్తున్నారు.

అదే రిపీట్ అవుతుందా :

ఇక చూస్తే 2029 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే తమ కుటుంబానికి అన్యాయం అంటూ ఆడబిడ్డగా షర్మిల జనంలోకి వెళ్తే అందులో లోతులు ఎవరికీ తెలియకపోయినా ఎంతో కొంత సానుభూతి అయితే ఆ వైపు వస్తుందని ఆ విధంగా వైసీపీ అధినాయకత్వం మీద వ్యతిరేకత కూడా కూడగడుతుందని అంటున్నారు. 2024 లో కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం మూడంటే మూడు సీట్లను వైసీపీ దక్కించుకుంది. అంటే జనాలు అప్పట్లో షర్మిల మాటలను ఎంతో కొంత నమ్మడం వల్లనే అని అంటున్నారు. అలాగే వైసీపీకి పట్టు ఉన్న కర్నూలు జిల్లాలో పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. అలాగే ఇతర జిల్లాలలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. దాంతో అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం మరోసారి వైసీపీని 2029 ఎన్నికల్లో కూడా ఇబ్బంది పెడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇంటి పోరుతోనే :

ఇక చూస్తే వైసీపీకి కూటమి మీద టార్గెట్ చేయడం కంటే కూడా ఈ ఇంటి పోరు తోనే తలనొప్పి ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ గ్రాఫ్ ని తగ్గించడమే కాకుండా అధినేత జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అన్న ఆందోళన పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. అయితే ఎవరెలా కలత చెందినా ఈ వివాదం అయితే ఇప్పట్లో తెమిలేది కాదనే అంటున్నారు. జనాలు అయితే 2024 మాదిరిగానే సీరియస్ గా షర్మిల ఆరోపణలను తీసుకుంటారా లేదా లైట్ తీసుకుంటారా అన్నదే 2029 ఎన్నికలలో వైసీపీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు.

Tags:    
  • ysrcp 
  • ysjaganmohanreddy 
  • ys sharmila 
  • andhrapradeshpolitics 

Similar News

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

2026-11-24 00:27 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

2026-11-24 00:25 GMT

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

2026-11-24 00:23 GMT

డిప్యూటీలలో కూటమి హవా...వైసీపీకి రెండే !

2026-11-23 17:45 GMT

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి రాజకీయాల వైపు.. 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా ‘చార్పిత’ చరిత్ర

2026-11-23 17:30 GMT

వైసీపీలో నెంబర్‌-3... ఫోక‌స్ ఆ వ‌ర్గంపైనేనా.. !

2026-11-23 14:30 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

Copyright @2026

Powered by Blink CMS