• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Prakasam >  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి రాజకీయాల వైపు.. 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా ‘చార్పిత’ చరిత్ర

| అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన చావలి చార్పిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలను వదిలి ప్రజాసేవను ఎంచుకున్నారు. టీడీపీ తరఫున 27వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె 24 ఏళ్ల వయసులో ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు.

By - A.N.Kumar
Update: 2026-11-23 17:30 GMT

సాధారణంగా 24 ఏళ్ల వయసులో ఉన్నత విద్య పూర్తి చేసిన ఏ యువతైనా ఏం కోరుకుంటారు? ఏసీ గదుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల రూపాయల ప్యాకేజీ.. విదేశీ ప్రయాణాలు.. ఇవే కదా.. అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన చావలి చార్పితకు కూడా ఆ అవకాశాలన్నీ తలుపు తట్టాయి. కానీ ఆమె మనసు మాత్రం తన సొంత గడ్డ ఒంగోలు ప్రజల సేవ వైపే మొగ్గింది. కంప్యూటర్ కీబోర్డులపై కోడింగ్ రాయడం కంటే సామాన్యుల కష్టాలను తీర్చే పాలనలో భాగస్వామి కావడమే నిజమైన సంతృప్తి అని నమ్మారామె. ఆ సంకల్పమే నేడు ఆమెను ఒంగోలు నగర చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన డిప్యూటీ మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది.

చార్పిత కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో విడదీయరాని అనుబంధం ఉంది. తాత చావలి కృష్ణయ్య కౌన్సిలర్‌గా.. నానమ్మ అనంతమ్మ అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చార్పిత కేవలం ఆ పేరుపైనే ఆధారపడలేదు. 27వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రతి గడపకూ వెళ్లారు. ఒక ఉన్నత విద్యావంతురాలిగా.. తమ ఇంటి ఆడపడుచుగా ప్రజల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలే నా బాధ్యత అంటూ ఆమె ఇచ్చిన భరోసా ఓటర్ల మనసులను గెలుచుకుంది. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే కార్పొరేటర్‌గా ఘనవిజయం సాధించారు.

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 62 డివిజన్లలో కూటమి 48 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప ఎన్నికవగా.. బీసీ రిజర్వ్‌డ్ అయిన డిప్యూటీ మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే యువతకు.. విద్యావంతులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో పార్టీ అధిష్ఠానం చార్పిత వైపు మొగ్గు చూపింది. దీంతో 24 ఏళ్ల చిన్న వయసులోనే ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టి ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. రాజకీయాలు మాకు కాదు అని దూరంగా ఉండే నేటి యువతరానికి చార్పిత ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తి.

చిన్న వయసులోనే ఇంతటి అత్యున్నత పదవి రావడం ఒక అద్భుతమైన అవకాశమైతే.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద సవాలు. ఒంగోలు నగరంలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె తన విద్యాబుద్ధులను.. ఆధునిక ఆలోచనలను జోడించాల్సి ఉంది. ముఖ్యంగా మహిళలు.. యువత సమస్యల పరిష్కారంలో ఆమె తనదైన ముద్ర వేస్తారని ఒంగోలు వాసులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని కాదని ప్రజాసేవను ఎంచుకున్న ఈ యువ నాయకురాలు.. పాలనలోనూ తన సత్తా చాటి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిద్దాం..



24 ఏళ్లకే డిప్యూటీ మేయర్.. Gen Z సెన్సేషన్! 24 ఏళ్ల చావలి చార్పిత ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 27వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె.. ఒంగోలు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ పదవి చేపట్టారు. SRM యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ రంగాన్ని కాదని రాజకీయాల్లోకి వచ్చారు. #ChavaliCharpitha #Ongole #DeputyMayor #GenZ #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 23, 2026


Tags:    
  • chavalicharpitha 
  • ongole 
  • deputymayor 
  • ongolemunicipalcorporation 

Similar News

జగన్ భారీ ఓటమి...ఆమంచి విశ్లేషణ అదుర్స్ !

2026-10-16 07:18 GMT

ఆమంచి రూట్ మార్చేశారు.. స‌క్సెస్ అయ్యేనా.. ?

2026-09-30 23:30 GMT

మంత్రిగారి గ్రాఫ్: గొట్టిపాటి దూకుడు.. !

2026-09-30 02:30 GMT

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!

2026-09-29 15:15 GMT

వెలిగొండ ఓపినింగ్.. జగన్, షర్మిల రియాక్షన్ ఇదే..

2026-08-31 13:50 GMT

ఏ ముఖ్యమంత్రికీ లేని రికార్డు బాబు సొంతం !

2026-08-31 13:49 GMT

స్టాండింగ్ ఒవేషన్.. వెలిగొండలో చంద్రబాబుకు అపూర్వ గౌరవం!

2026-08-31 12:51 GMT

కూటమిలో ఒంగోలు యుద్ధం.. ఎమ్మెల్యే దామచర్ల Vs జనసేన నేత బాలినేని!

2026-08-10 10:09 GMT

బాబు అంటే ఎంత ప్రేమ...అప్యాయత చూపిన సీఎం

2026-08-07 19:30 GMT

‘‘మీలో చైతన్యం రావడం లేదు.. నా అవసరం కోసం చెప్పడం లేదు’’ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

2026-08-07 17:14 GMT

బుర్రా వ‌ర్సెస్ మానుగుంట‌.. హీటెక్కిన పాలిటిక్స్ ..!

2026-07-31 04:07 GMT

Copyright @2026

Powered by Blink CMS