• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  అతి 'మౌనం' మంచిదేనా...

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

| ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది. ఈ సమయంలో పార్టీ బలోపేతం, కూటమి సమన్వయంపై దృష్టి పెట్టినా.. జిల్లాల్లో అసంతృప్తి, నేతల మధ్య బహిరంగ విమర్శలు పెరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. ఆదినారాయణరెడ్డి రాజీనామా వ్యవహారంతో పాటు ఇతర నేతల తీరుపైనా మాధవ్ మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది.

By - Garuda Media
Update: 2026-11-24 00:27 GMT

ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన పీవీఎన్ మాధ‌వ్ ఏడాదిన్న‌ర‌ పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాదిన్న‌ర‌ కాలంలో ఆయ‌న దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకున్నారా? లేదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. స్వ‌తంత్రం ఎక్కువ‌గా పెరిగిపోయింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పార్టీలో అంత‌ర్గ‌త స్వ‌తంత్రం బాగానే ఉన్నా.. కుమ్ములాట‌లు.. బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకునే స్థాయిలో నాయ‌కులు రోడ్డెక్క‌డం వంటివి ఇటీవ‌ల కాలంలో బాగా క‌నిపిస్తున్నాయి. వ్య‌క్తిగతం గా ఈ ప‌రిణామాలు ఆయ‌న‌కు, పార్టీకి కూడా మంచివి కాద‌ని చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ 2025, జూలై 1న బాధ్యతలు స్వీకరించారు. అప్ప‌టి నుంచి పార్టీ సంస్థాగత బలోపేతం, కూటమి సమన్వయంపై ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లా కమిటీల నియామకం. పార్టీని క్షేత్రస్థాయి లో బలోపేతం చేసే లక్ష్యంతో, రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతన అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లను మాధవ్ నియమించారు. ఇక్క‌డే మాధ‌వ్‌కు వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైంద‌న్న వాద‌న ఉంది. పార్టీ కోసం క‌ష్ఠ‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టార‌ని.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేశార‌ని తిరుప‌తి, చిత్తూరు, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో వ్య‌తిరేక విమ‌ర్శలు వ‌చ్చాయి.

ఏపీ బీజేపీ నూతన ఇన్‌ఛార్జ్‌లుగా డాక్టర్ అరవింద్ భడోరియా, వానతి శ్రీనివాసన్ నియమితులైనప్పుడు, వారి మార్గదర్శకత్వం లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. ఈ స‌మ‌న్వ‌యం కాస్తా గాడి త‌ప్పింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మాధవ్ విస్తృతంగా ప్రచారం చేసినా.. అనంత‌పురం సీటులో ప‌రాజ‌యం పాల‌వ‌డంతోపాటు.. విజ‌య‌న‌గ‌రం లోనూ పార్టీ అవ‌కాశం దెబ్బ‌తింది.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా అంశం తెరపైకి వచ్చినప్పుడు, ఆయన పార్టీకి విలువైన నాయకుడని పేర్కొంటూ, కుటుంబంలో సమస్యలు సాధారణమని, త్వరలోనే పరిష్కారమవుతాయని మాధవ్ సమన్వయంతో కూడిన ప్రకటన చేశారు. కానీ, దీనిని ఆది తీసేపారేశార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. బీజేపీ పెద్ద‌ల‌తోనే త‌న రాజ‌కీయం ముడిప‌డి ఉంద‌ని.. వారే త‌న‌కు టికెట్ ఇచ్చార‌ని అంత‌ర్గ‌త స‌మావేశంలో మాధ‌వ్ ముందే చెప్పేశారు. దీంతో చేసేది లేక మాధ‌వ్ మౌనం వ‌హించారు. అయితే.. ఈ ఒక్క విష‌య‌మే కాదు.. విశాఖ‌లోనూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇష్టాను సారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. మాధ‌వ్ మౌనంగా ఉన్నారు. ఎక్క‌డా ఎవ‌రినీ మంద‌లించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. దీంతో మాధ‌వ్ మౌనం మంచిదేనా? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    
  • pvnmadhav 
  • apbjp 
  • bjp 
  • andhrapradeshpolitics 
  • adinarayanareddy 

Similar News

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

2026-11-24 00:25 GMT

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

2026-11-24 00:23 GMT

డిప్యూటీలలో కూటమి హవా...వైసీపీకి రెండే !

2026-11-23 17:45 GMT

వైసీపీలో నెంబర్‌-3... ఫోక‌స్ ఆ వ‌ర్గంపైనేనా.. !

2026-11-23 14:30 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

2026-11-23 03:58 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS