• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Kakinada >  'పేపకాయల' వాళ్లు.. కలిసి...

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

| కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో ‘పేపకాయల’ ఇంటిపేరున్న కుటుంబాలు భారీగా సమావేశమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని 160 గ్రామాల నుంచి సుమారు 2 వేల మంది ఈ కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. కేవలం ఆత్మీయ పరిచయాలకే పరిమితం కాకుండా, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-23 11:02 GMT

ఒకే ఇంట్లో నలుగురు మనుషులు కలవడమే ఈ రోజుల్లో కష్టంగా మారిపోయింది. అలాంటిది ఒకే ఇంటిపేరు ఉన్న రెండు వేల మంది ఒకేచోట చేరితే ఆ సందడి ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా ఒకే ఇంటిపేరు.. పలకరింపుల్లో ఒకటే బంధం.. పరిచయాల్లో ఒకటే ప్రశ్న.. 'మీరు ఏ పేపకాయల వారు?' అంటూ సాగిపోయే ఆత్మీయ సంబరాన్ని ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కార్తీక వన మహోత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో ‘పేపకాయల’ ఇంటిపేరున్న కుటుంబాలు భారీగా సమావేశమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 160 గ్రామాల నుంచి వచ్చిన దాదాపు రెండు వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక రకంగా పేపకాయల కుటుంబాల సంగమంగా మారిపోయింది.

సాధారణంగా పెళ్లిళ్లు.. శుభకార్యాలు.. పండుగల సమయంలో బంధువులంతా ఒకచోట చేరుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం రక్తసంబంధం ఉందో లేదో తెలియదు.. కనీసం ఒకరికొకరు పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ఇంటిపేరు ఒక్కటైతే చాలు.. అందరూ ఆత్మీయులైపోయారు. ఒకే ఇంటిపేరుతో ఇంతమంది ఒకచోట చేరడం చూసి అక్కడికి వచ్చినవారికి కూడా ఆశ్చర్యం కలిగింది.

ఈ కార్యక్రమంలో ఆటపాటలు, సరదా సంభాషణలు, ఆత్మీయ పలకరింపులతో సందడి నెలకొంది. ఎక్కడెక్కడో స్థిరపడిన కుటుంబాలు తమ మూలాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాయి. ఇన్నాళ్లూ ఇంటిపేరు మాత్రమే తెలిసినవారు ఇప్పుడు ముఖపరిచయాలు కూడా పెంచుకున్నారు.

అయితే ఈ సమావేశం కేవలం సరదాలు, సంతోషాలకే పరిమితం కాలేదు. అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే మొదలైంది. వివిధ రంగాల్లో స్థిరపడిన పేపకాయల కుటుంబ సభ్యులు ఇకపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అండగా నిలవాలని.. వ్యాపారాలు చేసేవారు కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలనుకునేవారికి సహకరించాలని భరోసా ఇచ్చుకున్నారు.

అంటే ఇదేదో ఇంటిపేర్ల సమ్మేళనం మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఒకరికొకరు ఉపయోగపడేలా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా అన్నమాట. సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడానికి తాపత్రయపడుతున్న ఈ రోజుల్లో ఒకే ఇంటిపేరు ఉన్నవారంతా ప్రత్యక్షంగా కలుసుకుని పరిచయాలు పెంచుకోవడం విశేషమే.

రెండు వేల మంది ‘పేపకాయలు’ ఒక్కచోట చేరి తమ ఇంటిపేరుకు కొత్త గుర్తింపు తెచ్చారు. రేపు ఎవరైనా ఉద్యోగం కోసం వెతికినా.. వ్యాపారంలో అడుగుపెట్టినా.. ముందుగా తమ ఇంటిపేరు వాళ్లలో ఎవరైనా ఉన్నారా అని ఆరా తీసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంటిపేరు ఒక్కటైతే చాలు.. పరిచయం.. పరిచయం నుంచి పరిచయస్తులు.. అక్కడి నుంచి సహకారం.. ఇదీ పేపకాయల కుటుంబాల ఐక్యతా సూత్రం..

Tags:    
  • peepakayala 
  • kakinada 
  • andhrapradesh 
  • familygathering 

Similar News

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

కాకినాడకు GD 10 అలర్ట్.. అసలేంటి హెచ్చరిక

2026-10-27 10:44 GMT

మేయర్ లేదా జెడ్పీ చైర్మన్ గా ముద్రగడ కుమార్తె ?

2026-10-15 03:41 GMT

వైసీపీకి షాక్ ఇచ్చిన యనమల

2026-09-25 16:47 GMT

యనమల కృష్ణుడిని ఆపుతున్నదెవరు? జనసేనలో రెడ్ సిగ్నల్

2026-09-23 10:20 GMT

పవన్ కాకినాడ మీటింగ్...డిసైడ్ చేస్తారా ?

2026-09-20 16:40 GMT

రాజకీయ గోదాట్లో వైసీపీ ఇంచార్జిలు

2026-09-01 02:40 GMT

ఏఈ నూకరాజు అల్లుడి హత్య : ప్రొటీన్ పౌడర్‌లో విషం.. బయటపడ్డ సంచలన నిజాలు

2026-08-27 05:52 GMT

ఏఈ నూకరాజు అల్లుడిది హత్యే.. వెలుగులోకి షూటింగ్ కోచ్ దారుణాలు!

2026-08-18 08:57 GMT

'పెద్దాపురం' సీన్ మారుతోందా.. రాజ‌కీయాల‌కు రాజ‌ప్ప రాంరాం...?

2026-08-13 07:33 GMT

Copyright @2026

Powered by Blink CMS