• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Kakinada >  కాకినాడ మేయర్....వైసీపీ...

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

| ఏపీలో వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. కాకినాడ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ కాడా వెంకటరమణ భార్య సత్యశ్రీని వైసీపీ ఎంపిక చేసింది. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో దంపతులు పార్టీలో చేరిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By - Satya P
Update: 2026-11-12 22:30 GMT

ఏపీలో మినీ స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు తెర లేచింది. వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ నాలుగు వేటికవే ప్రతిష్టాత్మకమైనవి అందులో గోదావరి జిల్లాలలోనే రెండు ఉన్నాయి. అవి రాజమహేంద్రవరం, కాకినాడ. ఇందులో కాకినాడను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు. కాకినాడ జిల్లాలో జనసేన ప్రాబల్యం గట్టిగానే ఉంటుందని తాజా ఫలితాలు నిరూపించాయి. దాంతో వైసీపీ కూడా అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో జరిగే మేయర్ అభ్యర్థి కోసం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.

తటస్థ అభ్యర్థిగా :

పార్టీలో ఉంటున్న కీలక నేతలలో ఒకరిని మేయర్ పదవికి పోటీ కోసం వైసీపీ ఎంపిక చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ హైకమాండ్ ఆశ్చర్యకరంగా తటస్థ వర్గం నుంచి ఎంపిక చేసింది. పార్టీతో సంబంధం లేని ఒక డాక్టర్ కుటుంబం నుంచి మేయర్ సీటుకు పోటీ పెడుతోంది. అలా కాకినాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాడా వెంకటరమణ భార్య కాడా సత్యశ్రీని కాకినాడ మేయర్ అభ్యర్థిగా వైసీపీ ఎంపిక చేసింది. కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.

పార్టీలో చేరగానే :

ఇక చూస్తే పార్టీలో ఇలా చేరగానే అలా మేయర్ అభ్యర్ధిగా కాడా సత్యశ్రీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో డాక్టర్ కాడా వెంకటరమణ తన సతీమణితో కలిసి పార్టీలో చేరారు. దీంతో త్వరలోనే వైసీపీ మేయర్ అభ్యర్థిగా సత్యశ్రీ నామినేషన్‌ను దాఖలు చేస్తారని అంటున్నారు. ఇక కాడా సత్యశ్రీ ఎంపిక వెనక తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించారు అని చెబుతున్నారు.

కూటమిని ఎదుర్కొనేందుకు :

కాకినాడలో చూస్తే టీడీపీకి బలం ఉంది, జనసేనకు బలం ఉంది. పవన్ సొంత జిల్లా కావడం విశేషం. దాంతో గట్టి పోటీ ఉండనుంది. దాంతో పార్టీ ముఖాలను తీసుకుని వస్తే రొటీన్ అవుతుంది, అంతే కాదు కాకినాడ మేయర్ ఎన్నికలు అంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి, అలాగే విద్యావంతులు, తటస్థుల మద్దతు తీసుకోవాలి, దాంతో వైసీపీ అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు. అధికార కూటమికి ధీటైన పోటీ ఇవ్వవచ్చు అన్నది వైసీపీ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. ఇక రాజకీయంగా సామాజికంగా ప్రాంతీయంగా కూడా కాకినాడ మేయర్ సీటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. మరి డాక్టర్ ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రదర్శన చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా వైసీపీ ఏ విధంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి గోదావరి జిల్లాలలో ప్రత్యేకించి కాకినాడలో తన బలాన్ని పెంచుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    
  • kakinada 
  • kadasatyasri 
  • ysrcp 
  • ysjagan 

Similar News

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

కాకినాడకు GD 10 అలర్ట్.. అసలేంటి హెచ్చరిక

2026-10-27 10:44 GMT

మేయర్ లేదా జెడ్పీ చైర్మన్ గా ముద్రగడ కుమార్తె ?

2026-10-15 03:41 GMT

వైసీపీకి షాక్ ఇచ్చిన యనమల

2026-09-25 16:47 GMT

యనమల కృష్ణుడిని ఆపుతున్నదెవరు? జనసేనలో రెడ్ సిగ్నల్

2026-09-23 10:20 GMT

పవన్ కాకినాడ మీటింగ్...డిసైడ్ చేస్తారా ?

2026-09-20 16:40 GMT

రాజకీయ గోదాట్లో వైసీపీ ఇంచార్జిలు

2026-09-01 02:40 GMT

ఏఈ నూకరాజు అల్లుడి హత్య : ప్రొటీన్ పౌడర్‌లో విషం.. బయటపడ్డ సంచలన నిజాలు

2026-08-27 05:52 GMT

ఏఈ నూకరాజు అల్లుడిది హత్యే.. వెలుగులోకి షూటింగ్ కోచ్ దారుణాలు!

2026-08-18 08:57 GMT

'పెద్దాపురం' సీన్ మారుతోందా.. రాజ‌కీయాల‌కు రాజ‌ప్ప రాంరాం...?

2026-08-13 07:33 GMT

ముద్రగడ పాడె మోసిన జగన్.. తీవ్ర భావోద్వేగం

2026-07-15 11:41 GMT

Copyright @2026

Powered by Blink CMS