• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  బొత్స వర్సెస్ చిన్న...

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

| చీపురుపల్లి రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ, చిన్నశ్రీను మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. గత పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉన్న చిన్నశ్రీను ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చీపురుపల్లి, కొండపాలెం మేజర్ పంచాయతీలను రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోరు వేడెక్కింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-24 08:43 GMT

ఉత్తరాంధ్రలో అత్యంత కీలక నియోజకవర్గమైన చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ కీలక నేత, జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను మధ్య రాజకీయ పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు ముఖాముఖి పోటీ చేస్తారో లేదో కానీ ప్రస్తుతం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా వ్యూహరచన చేస్తున్నారు. జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల సమయంలో బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లికి దూరంగా ఉన్న చిన్నశ్రీను ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను సవాల్ గా తీసుకోవడమే ఆసక్తి రేకెత్తిస్తోందని అంటున్నారు.

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చీపురుపల్లి కేంద్రంగా బొత్స, చిన్న శ్రీను రాజకీయాలు చేస్తున్నారు. బొత్స అడుగు జాడల్లో ఇన్నాళ్లు నడిచిన చిన్నశ్రీను ఇప్పుడు సొంత బలం నిరూపించుకునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం చీపురుపల్లిలో టీడీపీ సీనియర్ నేత కళావెంకటరావు ఎమ్మెల్యేగా ఉండటంతో అక్కడి రాజకీయాలకు చిన్నశ్రీను దూరంగా ఉంటున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన తాను చీపురుపల్లి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్న ఆలోచనతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. దీని ఫలితంగా జడ్పీటీసీ ఎన్నికల్లో బొత్స పైచేయి సాధించారని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలకు రెండు వైసీపీ గెలుచుకోగా, ఒక మండల పరిషత్ నూ కైవసం చేసుకుంది. అదే సమయంలో ఒక మండల పరిషత్ లో టీడీపీతో సమానంగా సీట్లు సాధించింది.

సంఖ్యాపరంగా చూస్తే టీడీపీదే మెజార్టీ అయినప్పటికీ బొత్స బలపడ్డారనేది కాదనలేని నిజమని విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు వైఫల్యం కూడా ఉందనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే రాజకీయ చతురతతో నడుచుకుని ఉంటే వైసీపీ ఒక్కచోట గెలిచేది కాదని, బొత్స వ్యూహాలు తెలిసిన చిన్న శ్రీనును దూరంగా ఉంచడంతో మూల్యం చెల్లించుకున్నారని సొంత పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విషయంలో చిన్న శ్రీను జోక్యం చేసుకోడం హాట్ టాపిక్ అవుతోంది.

పరిషత్ ఎన్నికల సమయంలో చీపురుపల్లి వైపు చూడని చిన్నశ్రీను పంచాయతీ పోరులో మాత్రం దూకుడు చూపుతున్నారు. దగ్గరుండి పార్టీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించడం, వారి గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గంలో రెండు మేజర్ పంచాయతీలు ఉండగా, దాదాపు 30 వేల ఓట్లు ఆ రెండు పంచాయతీల పరిధిలో ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే చీపురుపల్లి, కొండపాలెం మేజర్ పంచాయతీల్లో మెజార్టీ సాధించాల్సివుంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఒక అడుగు వెనక్కి తగ్గి చిన్న శ్రీనుకు ఆ రెండు పంచాయతీలను అప్పగించాల్సివచ్చిందని అంటున్నారు. అటు బొత్స సైతం ఈ రెండు పంచాయతీలను తన వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకున్నారని చెబుతున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కొండపాలెం మేజర్ పంచాయతీలోని మూడు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడంతో అక్కడ ఆ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయనే విషయాన్ని సూచిస్తోందని అంటున్నారు. చీపురుపల్లి పట్టణంలోని ఆరు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అయితే ఓటింగ్ సరళిని గమనిస్తే ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉందని చెబుతున్నారు. అదేసమయంలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ బెల్లాన కుమారుడికి మెజార్టీ వచ్చినట్లుగా విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చీపురుపల్లి పంచాయతీపై వైసీపీ జెండా ఎగరేయాలని మాజీ మంత్రి బొత్స పావులు కదుపుతున్నారు. పార్టీ మద్దతుదారు నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా హాజరైన ఆయన కార్యక్రమానికి హాజరైన ఓటర్లను చూసి సంతృప్తి చెందారని అంటున్నారు. గెలుపుపై ఆశలు చిగురించడంతో అభ్యర్థికి ఆర్థికంగా భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు మేజర్ పంచాయతీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో గెలిచిన పార్టీనే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో హవా చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సీనియర్ నేత బొత్స, ఆయన మేనల్లుడు చిన్నశ్రీను రాజకీయ భవిష్యత్తు కూడా ఈ రెండు పంచాయతీలే నిర్దేశించనున్నాయని అంటున్నారు.

Tags:    
  • botsasatyanarayana 
  • chinnasrinu 
  • chipurupalli 
  • andhrapradeshpolitics 

Similar News

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

2026-11-24 00:27 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

2026-11-24 00:25 GMT

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

2026-11-24 00:23 GMT

Copyright @2026

Powered by Blink CMS