• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  డిసెంబర్ 3న...

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

| విజయసాయిరెడ్డి ప్రకటించిన ‘పరివర్తన రాజనీతి పార్టీ’ కేంద్ర కార్యాలయాన్ని డిసెంబర్ 3న ప్రారంభించనున్నారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు. పార్టీ కార్యవర్గంపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.

By - Tupaki Desk
Update: 2026-11-24 18:11 GMT

రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి జాతీయ రహదారి కీలక రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని డిసెంబర్ 3న ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ (X) వేదికగా అధికారికంగా వెల్లడించారు.

డిసెంబర్ 3వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కొలనుకొండలోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే జాతీయ రహదారి (మంగళగిరి హైవే) వెంబడి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కేంద్ర కార్యాలయాలు కొలువుదీరాయి. టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాలతో పాటు బీసీ నేత రామచంద్ర యాదవ్ పార్టీ ఆఫీసు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే రహదారి పక్కన ఉన్న కొలనుకొండలో విజయసాయిరెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 11న పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి, కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా త్వరలోనే ప్రకటించాల్సి ఉంది. పార్టీ వ్యవస్థాపకుడిగా విజయసాయిరెడ్డి స్వయంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేక తాను మార్గదర్శిగా ఉంటూ కొత్త తరం నాయకులకు పగ్గాలు అప్పగిస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి, జెన్ జీ యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. కార్యవర్గ కూర్పులో ఈ వర్గాలకు ఏ మేరకు స్థానం దక్కుతుందో చూడాల్సివుందని అంటున్నారు.

మరోవైపు గత కొంతకాలంగా ఆయన తన ప్రసంగాలు, ప్రకటనలలో హిందూత్వ అజెండాను ప్రముఖంగా ప్రస్తావిస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 3న జరిగే ప్రారంభోత్సవ సభ, అనంతరం నిర్వహించే మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి చేసే ప్రకటనలతో 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

Tags:    
  • vijaysaireddy 
  • parivarthanarajaneethiparty 
  • amaravati 
  • mangalagiri 
  • andhrapradeshpolitics 

Similar News

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

2026-11-24 08:43 GMT

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

Copyright @2026

Powered by Blink CMS