మోహన్ బాబు యూనివర్శిటీలో రచ్చ రచ్చ

మోహన్ బాబు విద్యా సంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడ్డ వర్గాల విద్యారుల నుంచి రూ.26 కోట్లు అక్రమంగా వసూలు చేశారని, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.;

Update: 2026-02-05 19:46 GMT

ఈ మధ్య లెజెండరీ నటుడు మోహన్ బాబు కుటుంబం తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. గత ఏడాది మంచు సోదరులు విష్ణు, మనోజ్‌ల మధ్య గొడవ కొన్ని నెలల పాటు మీడియాలో ఎలా పతాక శీర్షికలకు ఎక్కిందో తెలిసిందే. ఆ గొడవ కొంత సద్దుమణగగా.. మోహన్ బాబు యూనివర్శిటీ వ్యవహారం ఇప్పుడు తిరుపతిలో రచ్చ రచ్చగా మారింది. మోహన్ బాబు విద్యా సంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడ్డ వర్గాల విద్యారుల నుంచి రూ.26 కోట్లు అక్రమంగా వసూలు చేశారని, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఆ డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో బుధవారం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకులు నిరసన చేపట్టడానికి మోహన్ బాబు విద్యా సంస్థల వద్దకు వెళ్లారు. ఐతే ఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డగించిన మోహన్ బాబు మనుషులు వాళ్లందరినీ చితకబాది కిడ్నాప్ చేయడంతో వివాదం రాజుకుంది. మోహన్ బాబు కుటుంబానికి, విద్యా సంస్థలకు రక్షణగా నిలిచే బౌన్సర్లే ఈ పని చేశారు. తిరుపతిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

వామపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్టూడెంట్ లీడర్లను కిడ్నాప్ చేసిన వారిని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. అంతే కాక మోహన్ బాబు, విష్ణు సహా విద్యా సంస్థలకు సంబంధించి పలువురు వ్యక్తుల మీదా కేసులు పెట్టారు. ఈ వ్యవహారం తిరుపతిలో చర్చనీయాంశంగా మారి.. మోహన్ బాబు విద్యాసంస్థలకు చెడ్డ పేరు తెస్తోంది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడమే కాక.. దీనిపై ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఐతే స్టూడెంట్ లీడర్లు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారంటూ విద్యా నికేతన్ వర్గాలు చెబుతున్నాయి. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

Tags:    

Similar News