• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎట్టకేలకు దిగివచ్చిన...

ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం!

By - Tupaki Desk
Update: 2018-07-17 06:18 GMT
టీటీడీలో జరిగిన అక్రమాల గుట్టు బయటపడకుండా సంప్రోక్షణ పేరుతో గుడిని మూసేవేసి ఏదో చేయబోతోందా.? భక్తుల్ని అస్సలు అనుమతించకూడదనే నిర్ణయం వెనుక పెద్ద కుట్రే ఉందా.?’’ ఇవీ.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా వక్తపరిచిన అభిప్రాయాలు.. రోజానే కాదు.. టీటీడీ వ్యవహారాలు ఎన్నో ఏళ్ల నుంచి దగ్గరినుంచి చూసిన అధికారులు - స్థానిక ప్రజలు కూడా గుడిని సంప్రోక్షణ పేరుతో మూసేయాలనే నిర్ణయం వెనుక మతలబు ఏదో ఉందనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. గుడిని మూసివేసి.. సిసీ కెమెరాలు ఆపుచేసి  ఏదో చేయబోతున్నారనే  ప్రచారం ఊపందుకుంది..

టీటీడీ వ్యవహారాలపై మాజీ ప్రధాన ఆచార్యులు రమణ దీక్షితులు అప్పట్లో పలు సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి నగలు కాజేస్తున్నారని.. స్వామి వారి విలువైన వజ్రాన్ని విదేశాలకు తరలించారని.. టీటీడీలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు స్వామి విలువైన ఆభరణాలు దోచుకుంటున్నారని  విమర్శలు చేశారు. ఈ ఆరోపణలకు టీడీపీ ఎన్ని వివరణలు ఇచ్చినా అవి సంతృప్తి పరచలేదు.

తాజాగా  టీటీడీ అక్రమాలపై పోరాడుతున్న సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు తలుపుతట్టేందుకు రెడీ అవుతున్నారు. సుప్రీం కనుక స్పందించి విచారణ చేయిస్తే గుడిలో చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. అందుకే ‘ఇలా సంప్రోక్షణ పేరుతో అక్రమాలను కప్పేయడానికి టీడీపీ ప్రభుత్వం గుడిని మూసివేస్తోందా’ అని తాజాగా ఎమ్మెల్యే రోజా తిరుమలలో సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని రోజా వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా టీటీడీ తీరు ఉందని ధ్వజమెత్తారు. గుడిని మూసివేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని.. దీన్ని ఎదుర్కొనేందుకు తిరుమల భక్తులు - స్థానికులతో కలిసి ఆందోళన చేస్తామని రోజా హెచ్చరించారు.

ఎమ్మెల్యే రోజా హెచ్చరికలతో చంద్రబాబు దిగివచ్చారు. తిరుమల దేవాలయాన్ని మూసి వేసి గుట్టుగా చెద్దామనుకున్న పనులపై నిర్ణయాన్ని మార్చుకున్నారు. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని తాజాగా ఆదేశించారు.

ఎమ్మెల్యే రోజా తిరుమల భక్తుల పక్షాన పోరాడుతానని ప్రకటించడం., ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు వ్యక్తపరచడంతో  చంద్రబాబు ఉలిక్కిపడ్డాడు.  వివాదం పెద్దది కాకముందే దిద్దుబాటు చర్యలకు దిగారు. కానీ ఇప్పటికీ  టీటీడీలో అక్రమాలపై రోజా సంధించిన ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానమే లేకుండా పోయింది. రోజా వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి.  టీడీపీ నేతలు తిరుమల వెంకన్న గుడిలో గూడుపుఠాణి చేయకుండా రోజా అడ్డుకుందంటూ స్థానిక భక్తులు - సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా మహాసంప్రోక్షణ పేరుతో తిరుమల ఆలయంలో అక్రమాలను చెరిపేసుకుందామనుకున్న టీడీపీ నేతలకు రోజా అడ్డుగా నిలబడి గట్టి షాకే ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • YSRCP MLA 
  • Roja 
  • TTD 
  • TTD Rituals 
  • Telugu NEws 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS