• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వార్నింగ్ః సీఎం...

వార్నింగ్ః సీఎం మ‌నుషులం.. చంపేస్తాం!!

By - Tupaki Desk
Update: 2016-09-12 11:03 GMT
త‌న‌ను హత్య చేస్తామని బూతులతో హెచ్చరిక లేఖను గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుకొని ఆశ్చ‌ర్యానికి ఒకింత షాక్‌ కు గురికావాల్సి వ‌చ్చింది. ఏపీ రాజధాని ఉన్న అమరావతి ప‌రిధిలోకి వ‌చ్చేమంగళగిరి లోని ఎమ్మెల్యే కార్యాలయానికి ప్రభుత్వ పోస్ట్ మ్యాన్ ఒక కవర్ ను ఈ రోజు తీసుకొచ్చి ఇచ్చారు, ఆ కవర్ ను ఓపెన్ చేసి చూడగా... అందులో ఒక తెల్లకాగితం పై... ఈ క్రింది విధంగా రాసి ఉంది.

" ఒరేయ్ రామకృష్ణారెడ్డి ఏమిటి ఒళ్ళు ఎలా ఉంది మా ముఖ్యమంత్రి మీద కోర్టులో కేసు వేశావు దాని మీద హైకోర్టు లో స్టే తెచ్చుకుంటే నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టు కు వెళ్ళాలి అనుకుంటున్నావని తెలిసింది నా కొడకా నీకు ఇవే చివరి రోజులు నిన్ను నీ నియోజకవర్గంలోనే చంపుతా చూస్తూ వుండూ నా కొడకా నిన్ను మంగళగిరి లోనే చంపుతాము మేమంటే ఏమిటో నీకు త్వరలోనే తెలుస్తుంది చూస్తూ వుండు నా కొడకా నీకు రోజులు దగ్గర పడి మా నాయకుడు మీద కేసు వేశావు నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నావు ఇంక నిన్ను బ్రతకనివ్వం చూస్తూ వుండు నా కొడక ఖబడ్దార్" అంటూ ఆ లేఖ‌లో హెచ్చ‌రిక‌లు ఉన్నాయి.

ఈ లేఖలో ఎక్కడా ఫుల్ స్టాఫ్ కానీ, కామాలు కానీ లేకుండా... మ్యాటర్ కంటిన్యూ గా కొనసాగింది. కాగా... ఒక చోట" చంపుతా" అని ఉంటే... మరో చోట "చంపుతాము" అని ఉంది. అక్షరాలు చక్కగానే ఉండి... ఎక్కడా తప్పులు... కొట్టివేతలు లేకుండా.... భాష పరిజ్ఞానం ఉన్న వారు రాసినట్లుగానే ఉంది. ఎమ్మెల్యే ను ఉద్దేశించి... నీచమైన దుర్భాషలాడారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వంటి ప్రముఖులకు ఇలాంటి ఉత్తరాలు రావడంపై క‌ల‌క‌లం రేగుతోంది. ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని... ఈ దుస్సాంప్రదాయాన్ని మొగ్గలోనే తుంచేయాలని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    
  • YSRCP MLA 
  • Alla RamaKrishna Reddy 
  • Threatening Letter 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS