వైసీపీ దేశంలోనే నెంబర్ వన్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ప్రస్థానం కలిగిన పార్టీల్లో వైసీపీ కూడా ఒకటి. అయితేనేం... ఆ పార్టీని జగన్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేశారు. ఈ విషయంలో కాకలు తీరిన రాజకీయ నేతలను కూడా జగన్ వెనక్కు నెట్టేశారనే చెప్పాలి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తన రాజకీయ ప్రత్యర్థి - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన ఏకంగా గంగలో కలిపేశారని కూడా చెప్పాలి. అయినా ఏ విషయంలో జగన్ తన పార్టీని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపారంటే... అత్యధిక శాతం మంది విద్యావంతులను ఎన్నికల బరిలో నిలబెట్టిన పార్టీగా వైసీపీని ఆయన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. సుదీర్ఘ షెడ్యూల్ కలిగిన ఈ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా ఆరు విడతల ఎన్నికలు ముగిస్తే.. ఈ నెల 19న చివరి దశ పోలింగ్ తో మొత్తం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు సంబంధించి ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఇలాంటి కథనాల్లో కూడా జాతీయ మీడియా సంస్థలు వెలువరిస్తున్న అంశాలు మరింత ఆసక్తి కగిలిస్తున్నాయి. ఇలాంటి విశ్లేషణల్లో ఇప్పుడు ఇండియా టుడే సంస్థ వెలువరించిన ఓ కథనం వైసీపీని - ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఆకాశానికెత్తేసిందని చెప్పాలి.
ఈ ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ - 25 లోక్ సభ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించిన వైసీపీ... వారిలో ఉన్నత విద్యావంతులకే పెద్ద పీట వేసింది. దేశంలోని ఏ పార్టీ కూడా ఇవ్వనంతగా వైసీపీ ఉన్నత విద్యావంతులను బరిలోకి దింపి కాలరెగరేసిందనే చెప్పాలి. ఈ గణాంకాల విషయానికి వస్తే... వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా పీజీలు చేసిన వారే ఎక్కువగా ఉన్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది . ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా , అన్నాడీఎంకే 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.
ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో తొలిస్థానంలోనూ - దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి 80 శాతం తో 5 వ స్థానం - సీపీఎం 78 శాతంతో 6వ స్థానం - కాంగ్రెస్ 76 శాతంతో 7వ స్థానం - తృణమూల్ కాంగ్రెస్ 75 శాతంతో 8వ స్థానం - బీజేపీ 71 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే సర్వే చెప్పింది. మొత్తానికి విద్యావంతులను బరిలోకి దింపి వైసీపీని దేశంలో టాప్ పొజిషన్లో నిలిపిన జగన్ నిజంగానే గ్రేటేనబ్బా.