అరవ శ్రీధర్ విషయంలో జనసేన కీలక నిర్ణయం!

ఈ క్రమంలో... ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ పై వచ్చిన ఆరోపణలపై జనసేన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యేపై విచారణ చేయాలని జనసేన నిర్ణయించింది.;

Update: 2026-01-28 08:11 GMT

మొన్న తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ అయినా.. నేడు విప్, ఎమ్మెల్యే అయిన శీధర్ అయినా... వారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనసేనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఆరోపణలన్నీ మహిళలను లైంగికంగా వేధించినవి కావడంతో ఇవి మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపై పార్టీ తక్షణ చర్యల డిమాండ్లు అన్ని వర్గాల నుంచీ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జనసేన స్పందించింది.

అవును... రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విప్‌ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌.. తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్‌ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియోతో పాటు తెరపైకి వచ్చిన వాట్సప్ చాటింగ్, (న్యూడ్) వీడియో కాల్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

ఇది.. అటు ప్రధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో... ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి అదే ఆఖరి రోజు అంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తెరపైకి తెస్తోన్న పరిస్థితి. ఇదే సమయంలో.. బెత్తం దెబ్బలు, తోలు తీసే చట్టాలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో... ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ పై వచ్చిన ఆరోపణలపై జనసేన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యేపై విచారణ చేయాలని జనసేన నిర్ణయించింది. దీనికోసం.. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. టి.శివశంకర్‌, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి.వరుణ్‌ లతో కూడిన ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు శ్రీధర్‌ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ.. నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది.

'రాష్ట్రం జంగిల్ రాజ్ లా మారిపోయింది'!:

మరో వైపు ఈ వ్యవహారంపై వైఎస్ జగన్ స్పందించారు. తాజాగా భీమవరం నియోజకవర్గ కేడర్ తో భేటీ అయిన జగన్... కూటమి ఎమ్మెల్యేలు ఏస్థాయికి వెళ్లారో తెలియడంలేదని.. తాజాగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడని.. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం జంగిల్ రాజ్ లా మారిపోయిందని.. విచ్చలవిడి తనం కనిపిస్తోందని విమర్శించారు!

Tags:    

Similar News