నినాదం ఓకే.. ప్లానూ ఓకే.. కానీ, సాధించేదెవరు కిషన్ సర్!
తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర బీజేపీ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుం ది.;
తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర బీజేపీ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుం ది. ఏకంగా ఏడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు కైవసం చేసుకోవాలని, 116 మునిసిపాలిటీలలో సగంపైగా ద క్కించుకోవాలని నిర్ణయించుకుంది. భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. దీనికి సంబంధించి పార్టీ నాయకుల కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. పార్టీ తరఫున పెద్ద నినాదమే ఇచ్చారు. ''ఓట్ తెలంగాణ-సేవ్ తెలంగాణ'' నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేవారు ఎవరు? అనేది కీలక ప్రశ్న. అంతర్గత కుమ్ములాటలకు తెలంగాణ బీజేపీ ఆలవాలంగా మారింది. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య వివాదాలు.. విభేదాలు కామన్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరు పార్టీ కోసం కృషి చేస్తారన్నది ప్రశ్న. గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకునప్పటికీ..అక్కడ కూడా అదే జరిగింది. నేతల మధ్య వివాదాల కారణంగా బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
ఇక, ఇప్పుడు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రతి డివిజన్, వార్డులో పోటీ చేయాలని.. 5 కార్పొరేషన్లు, 58 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కిషన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న విషయంపై పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావుతో కలిసి కిషన్ రెడ్డి మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ‘సేవ్ తెలంగాణ... ఓట్ తెలంగాణ’ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అంతేకాదు.. ఎంపీలంతా రాష్ట్రంలో పర్యటించాలని కూడా పేర్కొన్నారు. ఇక, తాజా అంచనాల ప్రకారం.. నల్లగొండ, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి బాగుం దని ఇక్కడ విజయం దక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొనడం గమనార్హం. కానీ, ఎటొచ్చీ.. ప్లాన్ బాగున్నా, నినాదం బాగున్నా.. నేతల మధ్య సఖ్యతే అసలు సమస్యగా పరిణమించిందన్నది వాస్తవం. మరి దీనిని ముందు పరిష్కరించి.. తర్వాత ఎన్నికల గురించి ఆలోచిస్తే బెటర్ అంటున్నారు పరిశీలకులు.