భార్యకు రిలేషన్ తెలీకూడదని లవ్వర్ ను సూసైడ్ పేరుతో మర్డర్

కేరళలో ఒక యువతి సూసైడ్ ను పోలీసులు లోతుగా పరిశోధించిన వేళ.. అది ఆత్మహత్య కాదని.. కుట్రతో చేసిన హత్య అన్న విషయాన్ని గుర్తించారు.;

Update: 2026-01-28 07:30 GMT

తప్పుడు చేసేటప్పుడు రాని దుర్మార్గపు ఆలోచనలు.. వాటి నుంచి బయటపడేందుకు.. తాను బాగుంటే చాలు.. మిగిలినోళ్లు ఏమైనా ఫర్లేదన్నట్లుగా వ్యవహరించే దుర్మార్గుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందింది. ప్రేమించిన అమ్మాయిని వదిలించుకునేందుకు పెళ్లైన ఒక మగాడు వేసిన కిరాతక ఎత్తుగడ గురించి తెలిస్తే.. మనసంతా చేదుగా మారుతుంది. కేరళలో ఒక యువతి సూసైడ్ ను పోలీసులు లోతుగా పరిశోధించిన వేళ.. అది ఆత్మహత్య కాదని.. కుట్రతో చేసిన హత్య అన్న విషయాన్ని గుర్తించారు.

క్రైం థ్రిల్లర్ ను తలపించే ఈ ఉదంతంలోకి వెళితే.. కోళికోడ్ కు చెందిన వైశాఖన్ కు పెళ్లైంది. పెళ్లాముంది. అయినప్పటికి మైనర్ గా ఉన్న దూరపు బంధువు యువతితో వివాహేతర సంబంధం ఉంది. అయితే.. రోజులు గడిచే కొద్దీ.. తన తప్పుడు పనులు భార్యకు ఎక్కడ తెలిసిపోతాయన్న భయం పట్టుకుంది. దీనికి తోడు తనకున్న రిలేషన్ గురించి వివరాలు బయటకు పొక్కితే.. తనకు సమాజంలో ఉన్న పేరు.. గౌరవం తగ్గిపోతుందని ఆందోళనకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో.. తనకు ఎదురయ్యే

దీంతో.. తనను అమితంగా ప్రేమించి.. ఆరాధించే సదరు మహిళను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం భారీ ప్లాన్ వేశాడు. సామాజిక ఒత్తిడి కారణంగా తమ బంధాన్ని కంటిన్యూ చేయలేమన్న మాట చెప్పిన అతగాడు.. అదే సమయంలో ఆమె లేకుండా తాను బతకలేనని మాయమాటలు ఆ యువతికి చెప్పాడు. అతడి మాటల్ని ఆమె అమాయకంగా నమ్మేసింది. తమ బంధం కొనసాగని వేళ.. తాను బతికి ఉండటంలో అర్థం లేదని చెప్పి.. ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామని నమ్మించాడు.

అతడి మాటల్ని ఆమె పూర్తిగా నమ్మింది. అతడు చెప్పినట్లే.. అతడికి చెందిన ఆటోమొబైల్ వర్కుషాప్ వద్దకు వచ్చింది. ఇద్దరు వేర్వేరు కుర్చీలపై నిలబడి మెడకు తాళ్లను బిగించుకున్నాడు. ఆమె కుర్చీని తొలగించిన వైశాఖన్. తాను మాత్రం కుర్చీ దిగి పారిపోయాడు. అతడి మాటల్ని నమ్మిన బాధిత యువతి మెడకు ఉరి బిగిసుకొని ప్రాణాలు కోల్పోయింది. స్థానికులంతా ఈ ఉదంతాన్ని ఆత్మహత్యగానే భావించారు.

ఈ విషాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత.. కొన్ని సందేహాలు వారిలో వచ్చాయి. పోస్టు మార్టం రిపోర్టు సైతం సందేహాలకు తావిచ్చేలా మారింది. దీంతో మరింత లోతుల్లోకి వెళ్లిన పోలీసులు ఈ ఉదంతానికి సంబంధించి వైశాఖన్ ను అనుమానించారు. పలు ప్రశ్నలకు అతడి సమాధానాల్లో వచ్చిన తేడాలతో.. అతడికి తమదైన శైలిలో విచారణ చేయటంతో తాను చేసిన దుర్మార్గాన్ని పోలీసులకు ఒప్పేసుకున్నాడు. బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే తమకు సంబంధం ఉందని.. ఆమెను వదిలించుకోవటానికే ఇలాంటి ప్లాన్ వేసినట్లుగా పేర్కొన్నాడు. పోక్సో చట్టంతో పాటు హత్య అభియోగాలతో అతడ్ని రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News