• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీలో మాజీ ఎమ్మెల్యేకు...

వైసీపీలో మాజీ ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి జలక్

By - Tupaki Desk
Update: 2020-08-13 09:30 GMT
ఫిరాయింపులు ఆ వైసీపీ ఇన్ చార్జి సీటుకే ఎసరు తెచ్చాయా? చీరాలలో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్ల చెక్ పడిందా? వైసీపీ అధిష్టానం వేరే సీటును చూసుకోవాలని తెగేసి చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీచేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చవిచూశాడు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచాడు.
 
అంతకుముందు చీరాలలో ఆమంచి ఏమీ చెప్తే అదే జరిగేది. ఇప్పుడు కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన తరువాత వైసీపీ హైకమాండ్ అతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎందుకంటే  కరణం బలరాంకు ప్రకాశం జిల్లా అంతటా పట్టు ఉండడంతో వైసీపీ హైకమాండ్  గుర్తించి అతడి మాటకే విలువనిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఆమంచికి పర్చూరు ఇన్ చార్జిగా ఇస్తాం వెళ్లు అని వైసీపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చిందట.. కానీ ఆయన దానికి నో చెప్పి వెళ్లకుండా చీరాలలోనే రాజకీయం చేస్తాం అని కూర్చున్నాడు. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉందని సమాచారం. ‘వెళితే పర్చూర్ వెళ్లు.. లేకపోతే చీరాలలో రాజకీయం చేస్తే ఊరుకోము’ అని తెగేసి చెప్పినట్టు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

మరి వైసీపీ అధిష్టానం మాటను ఆమంచి లెక్కచేస్తాడా? నియోజకవర్గం మారుతాడా? లేక చీరాలనే పట్టుకొని తిరుగుబాటు లేవనెత్తుతాడా అన్నది ప్రకాశం జిల్లాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
 
Tags:    
  • YSRCP Hicommand 
  • Amanchi Krishna Mohan 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS