ఇగోకు పోతే.. చంద్ర‌బాబు దెబ్బ‌తిన్న‌ట్టే.. మీరు కూడా!

Update: 2022-02-23 10:30 GMT
రాజ‌కీయాల్లో ఇగోల‌కు తావులేదు. అలా ఉంటే.. పెద్ద న‌ష్టం భ‌రించ‌కత‌ప్ప‌దు. దీనికి చాలానే ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యం గా.. ప్ర‌జ‌ల మాట‌.. ప్ర‌జాప్ర‌తినిదుల మాట విన‌కుండా.. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తే.. ఎంత పెద్ద నాయ‌కులైనా.. ఎంత విజ‌న్ ఉన్న నాయ‌కులైనా.. బోల్తా కొట్టిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

ఏ ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ అయినా.. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగు తోంది?  ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు?  పొరుగు రాష్ట్రాల‌తో మ‌నం పోటీ ప‌డ‌గ‌లుగుతున్నామా?  వంటి కీల‌క అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అడుగులు వేయాలి. అంతేకాదు.. ప్ర‌తిరూపాయికీ.. జ‌వాబుదారీ త‌నంతో ఉండాలి.

ఒక‌వైపు పార్టీ కేడ‌ర్‌ను కాపాడుకుంటూ..మ‌రోవైపు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఇస్తూ.. ఇంకోవైపు.. ప్ర‌జ‌ల అభిలాష మేర‌కు పాల‌న‌ను ముందుకు సాగించాలి. ఈ మూడు సూత్రాల్లో ఏది దారి త‌ప్పినా.. మొద‌టికే ప్రమాదం వ‌స్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌రానే వాద‌న ఉంది. త‌న‌కు పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ఆయ‌న వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకున్నారు.

ఎంతో సీనియ‌ర్‌న‌ని చెప్పుకొనే ఆయ‌నే త‌ప్పుల‌పై త‌ప్పులు చేశారు. దీనికి కార‌ణం.. ఇగోనే!  నాక‌న్నా.. నీకు ఏంతెలుసు? అనే భావ‌మే! ఈ క్ర‌మంలోనే పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టిజంపింగుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇది పార్టీలో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చేలా చేసింది.

ఇక‌, ఐదేళ్ల పాల‌న‌లో చేయ‌ని సంక్షేమాన్ని.. ఎన్నిక‌ల‌కుముందు చేశారు. దీంతో ప్రుజ‌లు దీనిని గ్ర‌హించారు.  మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌పై కేసులు పెట్టించారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ నాయ‌కురాలు.. ఎమ్మెల్యేరోజాపై అసెంబ్లీలో ఏడాది పాటు వేటు వేయించారు. ఎక్క‌డ‌కు వ‌స్తే.. అక్క‌డ అరెస్టు చేయించారు.

వైసీపీ నేత‌ల‌కు వాయిస్ లేకుండా చేయించారు. అసెంబ్లీలో క‌నీసం మైకు కూడా ఇవ్వ‌లేదు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇన్‌స్టాల్‌మెంట్ మాదిరిగా అమ‌లు చేయించారు. ఇలా.. త‌ప్పుల‌పై త‌ప్పులు చేసి.. ఎవ‌రు చెప్పినా విన‌కుండా.. నాక‌న్నీ.. తెలుసు! అనే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించి.. చివ‌ర‌కు 2019 ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్రమే గెలిపించుకోగ‌లిగి.. అధికారం కోల్పోయారు.

ఇది.. చ‌రిత్ర‌! క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ పాల‌న‌లోనూ సేమ్ టు సేమ్ జ‌రుగుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. 151 మంది ఎమ్మెల్యులు ఉండి కూడా.. పొరుగు పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను లాగేసుకుంటున్నారు. రానివారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.

ఇక‌, పార్టీలో జీవిత కాలం ప‌నిచేసిన వారిని ప‌క్క‌న పెట్టి.. టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు ఇస్తున్నారు(తోట త్రిమూర్తులు, పండుల ర‌వీంద్ర‌బాబు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌.. ఇలా చాలా మంది). అదేస‌మ‌యంలోటీడీపీని అసెంబ్లీలో గ‌ళం వినిపించ‌కుండా చేస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, సొంత పార్టీలోనే కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.  

క‌న్ను పొడుచుకున్న క‌నిపించ‌ని అభివృద్ధి వెక్కిరిస్తోంది. మ‌రోవైపు అప్పుల కుప్ప‌లు.. పేరుకుపోతున్నాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు.. కేంద్ర ప్ర‌భుత్వం స‌హా మొత్తు కున్నా.. అంతా నా ఇష్టం! అంటూ.. ఎదురు దాడి చేస్తున్నారే త‌ప్ప‌.. ఎవ‌రి మాట‌నూ  వినిపించు కునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు చెత్త‌ప‌న్ను.. ఇత‌ర‌త్రా పన్నుల‌తో మ‌ధ్య‌త‌ర‌గతిపై భారాలు మోపుతున్నారు.  

ఇంకో వైపు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవ్వాల్సిన మంత్రులు.. మాట‌తీరు స‌క్ర‌మంగా లేక‌.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  ఏ మంత్రికీ.. త‌మ శాఖ‌పై ప‌ట్టులేదు. చేస్తున్న ప‌నులు కూడా క‌నిపించ‌డం లేదు. స్థానికంగా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీపై విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి.

అయినా.. ఏమీ ప‌ట్ట‌న‌ట్టు ఇగోకు పోతే.. గ‌త టీడీపీకి ప‌ట్టిన‌గ‌తే ప‌డుతుంద‌ని.. సొంత పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌ల జిల్లాల ఏర్పాటును తెర‌మీదికి తెచ్చాక కూడా సొంత పార్టీనేత‌ల‌తో ఒక్క‌సారి కూడా చ‌ర్చించ‌లేదు. దీనిని బ‌ట్టి.. ప్ర‌భుత్వం ఇగోకు పోతోంద‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు.
Tags:    

Similar News