దేశంలో నాలుగో పెద్ద పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ!
ఎంపీ సీట్ల వారీగా దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా నిలుస్తోంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఏపీ అసెంబ్లీ - లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించి జగన్ పార్టీ ఈ ఘనతను సొంతం చేసుకుంటూ ఉంది. దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నాసీనియర్లు అయిన ఎన్నో పార్టీలు - ప్రబల శక్తులున్నాయి. అయితే ప్రజలు ఇచ్చిన సీట్ల ద్వారా జగన్ పార్టీ ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా నిలుస్తూ ఉండటం విశేషం.
ప్రస్తుతం ఎంపీ సీట్ల వారీగా చూసుకుంటే.. భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు ఎంపీ సీట్లతో నంబర్ వన్ ప్లేస్ , ఎవరికీ అందనంత స్థాయిలో ఉంది. రెండో స్థానం దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ప్రస్తుతం లోక్ సభలో ఉన్న బలం యాభై రెండు ఎంపీ సీట్లు. మూడో స్థానంలో తమిళనాడు ప్రాంతీయ పార్టీ డీఎంకే ఉంటుంది. ఇరవై మూడు ఎంపీ సీట్లతో డీఎంకే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.
కేవలం ఒక్క ఎంపీ సీటు వెనుక ఉంటూ నాలుగో స్థానంలో నిలుస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇరవై రెండు ఎంపీ సీట్లతో జగన్ పార్టీ దేశంలోనే నాలుగో పెద్ద పార్టీగా నిలుస్తోంది. ఇదే స్థాయి సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగో స్థానంలోనే నిలుస్తోంది. ఐదో స్థానంలో శివసేన ఉంది. పద్దెనిమిది ఎంపీ సీట్లతో ఆ పార్టీ ఐదో స్థానంలో నిలుస్తోంది.