వైసీపీ నేతలు వేధిస్తున్నారు.. రెండ్రోజుల్లో చచ్చిపోతా..అదే పార్టీ కార్పొరేటర్ భర్త ఆవేదన
రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించటం.. అధికారంలో ఉన్న తమకు తగ్గట్లుగా నడుచుకోవాలన్న హెచ్చరికలు జారీ చేయటం అధికార పార్టీలో ఉన్న నేతల్లో కొందరు చేస్తుంటారు. అందరిలా చేస్తే అదెందుకు వైసీపీ అవుతుందని అనుకున్నారో ఏమో కానీ.. ప్రత్యర్థుల సంగతి తర్వాత సొంత పార్టీకి చెందిన నేతను వేధిస్తున్న వైనం తాజాగా సంచలనంగా మారింది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ఇప్పుడు వైరల్ గా మారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ జరిగిందేమంటే.. విజయవాడకు చెందిన 48వ వార్డు కార్పొరేటర్ ఆదిలక్ష్మి. వైసీపీకి చెందిన ఆమె భర్త పేరు అత్తులూరి పెదబాబు.
ఆయనకు కేబుల్ వ్యాపారం ఉంది. ఇదిలా ఉంటే.. తన భార్య వైసీపీకి చెందిన కార్పొరేటర్ అయినప్పటికీ.. తన కేబుల్ వీడియో వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని... ఇదేమాత్రం మంచిది కాదంటున్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. పార్టీకి సేవ చేసిన తనకు సొంత పార్టీ వారే తనకు శిక్ష వేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా తనను బెదిరిస్తున్నారని.. సిగ్నల్స్ ను కట్ చేసి హింసిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నుంచి వచ్చిన వారిమాటల్ని విని.. సీనియర్ నాయకుల్ని.. కార్యకర్తలను మోసం చేసి ఇబ్బంది పెడుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగిత.. తాను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్దంగా ఉన్నారన్నారు. తన చావుకు వారిదే బాధ్యత అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.మరి.. పార్టీ సీనియర్లు.. కీలక స్థానాల్లో ఉన్న వారు తమ పార్టీ కార్పొరేటర్ భర్త ఆవేదనను మరెంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.