చంద్రబాబు మరో సంచలనం... నెయ్యిలో బాత్రూమ్ కడిగే కెమికల్స్!

అవును... తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన చంద్రబాబు.. తిరుమల లడ్డు, కల్తీ నెయ్యి వ్యవహారంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-02-06 12:44 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, దాడుల వరకూ వ్యవహారం మారిపోయిన పరిస్థితి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇవి మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అవును... తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన చంద్రబాబు.. తిరుమల లడ్డు, కల్తీ నెయ్యి వ్యవహారంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం లో కూడా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఇవి సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా... బాత్రూమ్ లు కడిగే కెమికల్స్ ని నెయ్యిలో వాడారని, తాను పత్రికల్లో చూసి షాక్ అయినట్లు తెలిపారు!

ఈ సందర్భంగా... తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారని.. అయితే, దీనిపై సీబీఐ, సిట్ ఏమీ లేదని చెప్పారని అంటున్నారని చెప్పిన చంద్రబాబు... అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్.డీ.డీ.బీ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో కల్తీ నెయ్యి సరఫరా చేశారని.. శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారని తెలిపారు. అయితే.. గతంలో పోలిస్తే ప్రస్తుతం లడ్డూలో చాలా వ్యత్యాసం ఉందని చంద్రబాబు తెలిపారు.

'మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి'!:

మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఓ కీలక పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... హిందువుల్లో ఉదాసీన వైఖరి మారాలని.. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని.. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని చెబుతూ... హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికీ వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ సందర్భంగా... 'ఎవరైనా హిందూ దేవుళ్లను అపవిత్రం చేసినప్పుడు లేదా మన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, మనం తరచుగా వ్యక్తిగతంగా బాధపడతాము.. దానిని కర్మకు వదిలివేసి ముందుకు సాగుతాము. అయితే.. ఇది మారాలి. మనం కులం, మతం, ప్రాంతం, భాష ద్వారా విభజించబడినప్పటికీ.. హిందూ ధర్మం ఒక్కటే. మన ధర్మం, విశ్వాసం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో అపహాస్యం చేయబడినప్పుడు మన బాధను వినిపించడం నిజంగా మన కర్తవ్యం' అని పవన్ అన్నారు.

Tags:    

Similar News