పీకేతో జగన్ న్యూ డీల్?

Update: 2022-02-07 13:21 GMT
ఇల్లు అలకగానే పండగ కాదు.. అప్పుడంటే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాడు.. ఒకసారి ఓడిపోయాడని జగన్ ను ఏపీ ప్రజలు ఆదరించారు. ఈ క్రమంలోనే గెలుపు గుర్రంగా ఉన్న జగన్ తో ఎన్నికల వ్యూహకర్త పీకే టీం పని సులువైందట.. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ఉండడం సహజమేనంటున్నారు.. మొన్నీ మధ్య ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ వర్గాలు సమ్మెకు దిగడమే దీనికి నిదర్శనం.  మరి ఇప్పుడు ఇంతటి వ్యతిరేకతలో పీకే టీం జగన్ ను వచ్చేసారి గెలిపించడమే అసలు సిసలు ట్విస్ట్ అన్న అభిప్రాయం ఉంది.. మరి దీన్ని పీకే టీం ఎలా నిర్వర్తిస్తుంది? డీల్ ఎంతకు కుదుర్చుకుంది.. ఇలా ఆసక్తికర పరిణామాలపై ఇన్ సైడ్ కథనం..

కాలం గడిచేకొద్దీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడే ఎన్నికల జపం చేస్తున్నారు. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా రాజకీయ పార్టీల నేతలకు అప్పుడే ఎన్నికల జ్వరం పట్టుకుందట.. తాజాగా ఏపీ సీఎం జగన్ సైతం అదే బాటలో పయనిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జగన్ కొత్త డీల్ సెట్ చేసుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాడని గుసగుసలాడుకుంటున్నారు.

కొంత కాలం కింద నుంచి పీకేతో పని మొదలుపెట్టాలని అనుకున్నారట.. కానీ పీకే ఎందో అంత ఆసక్తి చూపించలేదట.. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పీకే టీం అడుగుపెడితే కడిగేయడానికి వైసీపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారట.... 2019లో ఎన్నికలకు వర్క్ చేసిన కార్యకర్తలకు న్యాయం జరగలేదని.. పీకే టీం మీద చాలా కోపంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పీకే టీం గతంలో సాధ్యం కానీ హామీలన్నీ వైసీపీ క్రింది స్థాయి కార్యకర్తలకి చెప్పి వాళ్లతో పనిచేయించుకున్నారట.. తీరా వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్లని కనీసం పట్టించుకోలేదని.. అందుకే పీకే టీం ఇప్పుడు ఎలా అడుగు పెడుతుందో చూస్తామని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని కొంతమంది అంటున్నారు.

2019లో జగన్ మీద సానుభూతి ఉందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్న అపవాదుతో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో  పీకే టీం ఎలా పనిచేస్తుందన్నది చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.  నెగ్గే గుర్రాన్ని పట్టుకొని గెలిచే అలవాటు ఉన్న పీకే అండ్ కోకు ఇప్పుడు ఏపీలో ఎలా డీల్ చేస్తుందో చూడాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జగన్ పార్టీ నుంచి 400 కోట్ల డీల్ చేసుకున్నారనే వార్త ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతోంది. చూడాలి మరీ ఈ వార్త నిజమా? లేక అబద్దమా? ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఆర్టికల్ మీద మీ కామెంట్ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి..
Tags:    

Similar News