ఆ ఇద్దరూ చేతులు కలిపితే....బిగ్ ట్రబుల్స్ స్టార్ట్... ?
రాజకీయాల్లో తెలుగు రాజకీయాలు వేరయా అన్నట్లుగా ఉంటాయి. మిగిలిన వారు తమలో ఎన్ని విభేదాలు ఉన్నా కామన్ ఇష్యూస్ వస్తే కలసిపోతారు. ముఖ్యంగా ఉత్తరాదిలోని హిందీ బెల్ట్ అంతా ఒక్కటిగా ఉంటారు. అందుకే ఏడున్నర దశాబ్దాల రాజకీయాల్లో ఉత్తరాదివారే ఎపుడు ప్రధానులు అవుతున్నారు. ఇదిలా ఉంటే సౌత్ లో చూసుకుంటే కన్నడ సీమ, తమిళ నాడు లో కట్టు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ సీన్ లేదనే చెప్పాలి.
ఇక తెలంగాణా సీఎం జాతీయ రాజకీయాల్లో రాణించాలని చాలా కాలంగా కలలు కంటున్నారు. ఆయన ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా కొన్నాళ్ళ పాటు పనిచేశారు. ఇక 2018లోనే ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీయార్ తన రాజకీయ అజెండాను ముందు పెట్టారు. జగన్ పాదయాత్రను ముగించుకుని వచ్చిన తరువాత లోటస్ పాండ్ లో కేటీయార్ ని పంపించి ఫ్రంట్ లో చేరమని ఆహ్వానించారు.
ఇక జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీయార్ హాజరై సందడి చేశారు. ఇలా జగన్ మీద ఎన్నో ఆశలు కేసీయార్ పెట్టుకున్నారు అంటారు. అయితే జగన్ మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని ప్రచారం సాగుతోంది. కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఆయన పెదవి విప్పడంలేదు. ఏపీ తెలంగాణా కలిస్తే 42 ఎంపీ సీట్లు ఉంటాయి. జాతీయ స్థాయిలో రాజకీయం చేయడానికి కేసీయార్ కి కొత్త బలం వస్తుంది.
అయితే ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ బీజేపీకి యాంటీగా బాహాటంగా రియాక్ట్ కాలేరు అని అంటున్నారు. అదే టైమ్ లో ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలలో ఎవరేంటి అన్నది కూడా జగన్ కి లెక్కలు ఉన్నాయని అంటారు. మొత్తానికి కేసీయార్ కలలు కన్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో జగన్ మాత్రం పెద్దగా స్పందించడంలేదు.
సానుకూలంగా జగన్ లేకపోవడంతోనే గులాబీ బాస్ కి బాగా మండుకొస్తోంది అన్న ప్రచారం ఉంది. అందుకే ఆయన ఏపీలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగిస్తున్నారు అని గట్టిగా విమర్శలు చేస్తున్నారు.
ఏపీలో కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదని ఒకసారి అన్నారు, ఏపీ కంటే తెలంగాణాలో తలసరి ఆదాయం చాలా ఎక్కువని మరో సారి అన్నారు. ఇలా వీలైనపుడుడల్లా సెటైర్లు వేస్తూ జగన్ని ఇరుకున పెడుతున్నారు అని అంటున్నారు.
ఈ విధంగా జగన్ తో కేసీయార్ దూరంగా ఉండడం టీడీపీ ఆసక్తికరంగా గమనిస్తోంది. రేపటి రోజున ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ ఇది మంచి సంకేతంగా భావిస్తోంది. ఇంకో వైపు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. అందువల్ల ఆయన కేసీయార్ కు సాయపడవచ్చు అని కూడా చెబుతున్నారు. కేసీయార్ సైతం ఎప్పటికపుడు వ్యూహాలను మారుస్తారు.
ఏపీలో ఒకనాడు చంద్రబాబుకు యాంటీగా జగన్ని ప్రోత్సహించిన కేసీయార్ ఇపుడు జగన్ని ఇబ్బంది పెట్టడానికైనా చంద్రబాబుతో చెలిమి చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. అలా కనుక ఇద్దరు చంద్రులు చేతులు కలిపితే వారి రాజకీయ ఎత్తులు, అనుభవంతో చాలా గట్టిగానే జగన్ పోరాడాల్సి ఉంటుంది అంటున్నారు.
ఒక విధంగా ఇదే కనుక జరిగితే తెలుగు రాజకీయాల్లో ఇది కీలకమైన పరిణామం అని అంటున్నారు. ఇద్దరికీ ఒకే సమయంలో ప్రత్యర్ధిగా మారితే జగన్ బిగ్ ట్రబుల్స్ నే ఫేస్ చేయల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.