• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  17 ఏళ్ల స్కూలు బాలిక...

17 ఏళ్ల స్కూలు బాలిక ముఖంపై యాసిడ్ పోసిన యువకులు.. వైరల్ వీడియో

By - Tupaki Desk
Update: 2022-12-14 09:28 GMT
నానాటికీ పెరుగుతున్న క్రైమ్ రేట్ కారణంగా ఢిల్లీని దేశ క్రైమ్ క్యాపిటల్‌గా మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో పాఠశాల విద్యార్థినిపై పట్టపగలు యాసిడ్‌ దాడికి పాల్పడిన మరో దారుణమైన ఘటన అందిరినీ షాక్ కు గురిచేసింది.. ఈ ఘటన కెమెరాకు చిక్కింది.

బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కలకలం రేపింది. ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

బుధవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని సఫ్దుర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీలో రికార్డైన విజువల్స్ ప్రకారం, యువతి రోడ్డు పక్కన తన చెల్లితో కలిసి నడుస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె ముఖంపై యాసిడ్ విసిరారు. వారు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఆమె ముఖంపై యాసిడ్ పడడంతో బాలిక వెంటనే పరిగెత్తింది. నొప్పితో విలవిలలాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

పోలీసు అధికారులు, డీసీపీ ద్వారక ఆస్పత్రికి చేరుకుని ప్రస్తుతం బాలిక బంధువుతో మాట్లాడుతున్నారు. తమకు తెలిసిన ఇద్దరు వ్యక్తులపై ఇప్పటికే అనుమానం పెంచుకున్నారు. వారిలో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, దీనిపై వైద్యులు త్వరలో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

బాలిక ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పిందని వారిలో ఒకరిని అరెస్ట్ చేశఆమని పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View



Full ViewFull ViewFull ViewFull View
Tags:    
  • Delhi 
  • AcidAttack 
  • Girl 
  • LatestNews 
  • UttamNagar 
  • SafdurjungHospital 
  • TupakiNews 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS