• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు అవినీతిని దాచేందుకు...

బాబు అవినీతిని దాచేందుకు రంగంలోకి దిగిన ఎల్లోమీడియా!

By - Tupaki Desk
Update: 2020-01-13 01:30 GMT
జగన్ ప్రభుత్వంపై పచ్చ మీడియా బురద జల్లుతోందని.. అందులో భాగంగానే అసత్య ప్రచారాలు చేస్తోందని  మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు, ఛానల్స్‌ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని బొత్స విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తందున్న ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘటన సీఎం జగన్‌దేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి కింద రూ.6,400 కోట్లు విడుదల చేశారన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. అమరావతిలో చేసిన తప్పులు, అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు నానా తిప్పలు పడుతూ నాటకాలు ఆడుతున్నారన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు కారణమని.. చంద్రబాబు చేసిన తప్పులను జగన్ సరిదిద్దుతున్నారని అన్నారు. చంద్రబాబు తన బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.


Tags:    
  • Yellow Media 
  • Chandrababu Naidu 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS