అవినీతి నాయకులకు టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిపతి అని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా విమర్శించారు. వంగి వంగి డండాలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సొంత మామ ఎన్ టీఆర్ కు వంగి దండం పెట్టిన చంద్రబాబు ఆ తరువాత ఆయన్ను ఏం చేశారో అందరికి తెలుసు అన్నారు. మోడీ- పవన్ కు దండాలు పెట్టి అధికారం చేజిక్కించుకున్నది ఎవరో అందరికి తెలుసు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ - అప్పటి కేంద్ర మంత్రి చిదంబరానికి నాడు దండాలు పెట్టిన చంద్రబాబు జగన్ పై కేసులు పెట్టించారని రోజా దుయ్యబట్టారు. వంగి దండాలు పెట్టడంలో బాబుకు ఒలింపిక్స్ అవార్డు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
వంగి వంగి దండాలు పెట్టడంలో సిద్ధహస్తున్నడైన ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ తో కూడా కుమ్మక్కయ్యారని రోజా ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎ్రరనాయుడు - కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్ రావులతో అక్రమ కేసులు పెట్టించారన్నారు. ఇప్పుడు దాన్నే అస్త్రంగా వాడుకోవాలని చూడటం చంద్రబాబు అవివేకమన్నారు. వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరి ఏ ప్రాతిపదిక కేంద్ర మంత్రిని చేశారని ప్రశ్నించారు. వందల కోట్లు బ్యాంకులకు ఎగగొట్టి వైజాగ్‌లో ప్రభుత్వ భూములను కాజేసిన గంటా శ్రీనివాసును ఏ విధంగా అసెంబ్లీ కేబినెట్ మంత్రిగా చేశావని ప్రజలు అడుగుతున్నారని రోజా అన్నారు. 15 కేసులు ఉన్న చింతమనేని ప్రభాకర్ ను అసెంబ్లీ విప్ గా ఎలా నియమించావని ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్న వ్యక్తులు టీడీపీలో ఉన్నారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని రోజా స్పష్టం చేశారు. అయితే తమ నిర్దోషిత్వం బయటపడుతుందనే...ప్రత్యేక హోదాను డైవర్ట్ చేసేందుకు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. విజయసాయిపై అవాస్తవాలు ప్రచారం చేసే బదులు టీడీపీకి దమ్ముంటే రాజ్యసభ పుటేజీలు తీసుకురావాలన్నారు. బహిరంగ చర్చకు ఎందుకు టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారని రోజా మండిపడ్డారు.