• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుతో వైసీపీ నేత.....

చంద్రబాబుతో వైసీపీ నేత.. ఏంటా కథ?

By - Tupaki Desk
Update: 2021-06-20 00:30 GMT
సాధారణంగా అధికార పార్టీలో చేరడానికి నేతలు క్యూ కడుతారు. ప్రతిపక్ష పార్టీ వైపు అస్సలు తిరిగి చూడరు. కానీ చంద్రబాబుకు ఇప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైందట.. ఇప్పటికే చంద్రబాబు పార్టీకి చెందిన కింది స్థాయి నేతలంతా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు పలికారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఒక నేత.. అదీ సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నేత ఎవరు? ఎందుకు వెళ్లారన్నది చర్చనీయాంశమైంది.

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇద్దరూ భేటి అయినట్టు సమాచారం. రాయచోటి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు ఇవ్వాలని.. పార్టీని బలోపేతం చేస్తానని బాబుకు రాంప్రసాద్ రెడ్డి విన్నవించినట్టు తెలిసింది. రాంప్రసాద్ రెడ్డి ఇదివరకే చంద్రబాబును కలిసారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా శ్రీకాళహస్తికి వెళ్లిన సందర్భంలోనూ వీరిద్దరి భేటి జరిగింది.  స్తానిక రాజకీయ పరిణామాలతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టుగా చెబుతున్నారు.

మరి దీనిపై వైసీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    
  • Chandra Babu Naidu 
  • TDP 
  • Political News 
  • Telugu Desam Party 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS