మంత్రి గుమ్మ‌నూరుకు సెగ‌.. సొంత పార్టీ కార్య‌క‌ర్త ఫైర్‌.. రీజ‌న్ ఇదే!

Update: 2022-02-10 03:30 GMT
మంత్రి గుమ్మనూరి జయరాంపై ఓ సామాన్య కార్య‌క‌ర్త‌ ఘాటైన విమర్శలు చేశాడు. మంత్రిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నా రంటూ జయరాంపై నిప్పులు చెరిగాడు. అధికారంలోకి వచ్చాక ఒక్క మంచిపనైనా చేశారా? అంటూ ప్రశ్నించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా కు చెందిన కీల‌క నాయ‌కుడు, మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ఆయ‌న కుమారుడు ఓ కంపెనీ నుంచి లంచంగా కారును తీసుకున్నారంటూ.. టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు విమ‌ర్శ‌లు చేశారు.

అదేవిధంగా భూములు దోచుకున్నార‌నికూడా అయ్య‌న్న అప్ప‌ట్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిని నిరూపించేందుకు కూడా తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. స‌వాళ్లు కూడా రువ్వారు. ఇక‌, ఇప్పుడు సొంత పార్టీఆలోనే మంత్రికి సెగ ప్రారంభ‌మైంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు.. ఇలాంటి సెగ త‌గులుతున్న విష‌యం తెలిసిందే. కానీ, ఇది మ‌రింత తీవ్రంగా ఉంది. త‌మ‌కు మాయ మాట‌లు చెప్పి ఓట్లు వేయించుకున్నార‌ని.. క‌నీసం.. గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ఒక సాధార‌ణ కార్య‌క‌ర్త‌.. మంత్రిని నిల‌దీశారు. సెల్ఫీ వీడియోలో మంత్రిని క‌డిగేశారు.

వైసీపీ యువ నాయ‌కుడు సుంక‌న్న‌.. తాజాగా పెట్టిన సెల్ఫీ వీడియో సంచ‌ల‌నంగా మారింది. త‌మ గ్రామానికి ఎన్నో చేస్తాన‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌య‌రాం హామీలు గుప్పించార‌ని.. ఆయ‌న పేర్కొన్నారు. 2019లో త‌మ‌కు అనేక హామీలు ఇచ్చార‌ని తెలిపారు. అయితే.. ఒక్క జ‌యరాం కుటుంబ‌మే ఈ రెండున్న‌రేళ్ల కాలంలో ల‌బ్ధి పొందింద‌ని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయ‌న‌.. త‌న కుటుంబ సేవ‌లోనే త‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌ను న‌మ్ముకుని ఓట్లేసిన వారికి ఏమీ చేయ‌లేద‌న్నారు. క‌నీసం గ్రామానికే ఏమీ చేయ‌లేని మంత్రి జిల్లాకు ఏం చేస్తార‌ని.. నిల‌దీశారు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టికే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. రాష్ట్రంలో వైసీపీ నేత‌ల‌కు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోం ద‌ని.. పూర్తిస్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నేత‌లు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నార‌ని.. ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం.. పార్టీ అధినేత జ‌గ‌న్‌పైనే ఆశ‌లు ఉన్నాయ‌ని.. ఆయ‌న‌పైనే సంపూర్ణ సంతృప్తి ఉంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ చేసిన స‌ర్వేలో స్ప‌ష్టమైంది.  ఇక‌, క్షేత్ర‌స్థాయిలో కార్య‌కర్త‌లు తీవ్ర అసంతృప్తిలో  ఉన్నార‌ని.. వారిని ఎన్నిక‌ల స‌మ‌యంలో వాడుకుని వ‌దిలేయ‌డం స‌మంజ‌సం కాద‌ని పేర్కొన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదే ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు క్షేత్ర‌స్థాయి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు పూర్తిగా డ‌మ్మీలుగా మారార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వారికి నిధులు లేవు. చేసేందుకు ప‌నులు కూడా లేక పోవ‌డం.. సంక్షేమ ప‌థ‌కాల బాధ్య‌త మొత్తం వ‌లంటీర్లే చూస్తుండ‌డంతో ఎమ్మెల్యేలు పూర్తిగా ఉత్స‌వ విగ్ర‌హాలుగా మారిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పుల్లో ఉండ‌డంతో అభివృద్ధికి నిధులు కేటాయించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో రెండున్న‌రేళ్ల‌లో వారు ఒక్క ప‌నిని చేప‌ట్ట‌లేక పోయారు. దీంతో ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. అటు పార్టీఆ కేడ‌ర్‌లోనూ ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News